ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన ప్రాంతాల్లో నరసరావుపేట ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన వారు రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ ఉన్నత విద్యావంతులే ఎన్నికవుతూ వస్తున్నారు. వీరిలోనూ వైద్యులే ఎక్కువ.

ఈ నియోజకవర్గంలో 2,13,429 మంది ఓటర్లు  ఉన్నారు. 1983 నుంచి 2004 వరకు ప్రస్తుత శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎన్నికవుతూ వస్తున్నారు. ఆయన టీడీపీలో అగ్రనేతగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈయన వైద్యుడే.

2014 శాసనసభ ఎన్నికల్లో రొంపిచర్ల మండలానికి చెందిన ప్రముఖ వైద్యుడు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి , సంతగుడిపాడుకు చెందిన ప్రముఖ పశువైద్యులు డాక్టర్ నల్లబోతు వెంకట్రావుపై గెలుపొందారు.

ప్రస్తుత ఎన్నికల్లోనూ.. వైద్య రంగానికి చెందిన వారే మళ్లీ తలపడుతున్నారు. వైసీపీ తరపున డాక్టర్ గోపిరెడ్డి  శ్రీనివాస్ రెడ్డి రెండవసారి బరిలో నిలవగా.. టీడీపీ  తరపున డాక్టర్ అరవిందబాబు పోటీ చేస్తున్నారు.