గుంటూరు: ఏపీ మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ పై వైసీపీ నేత వైఎస్ షర్మిల రెచ్చిపోయారు. లోకేష్ ఓ పప్పు అంటూ అభివర్ణించారు. పప్పుగారికి కనీసం జయంతికి, వర్థంతికి తేడా కూడా తెలియదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

గుంటూరు జిల్లా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ షర్మిల లోకేష్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. బాబు వస్తే జాబు వస్తుందని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని కానీ జాబు వచ్చింది కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్‌కు మాత్రమేనని స్పష్టం చేశారు. 

ఓనమాలు రాని వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారంటూ ధ్వజమెత్తారు. అ ఆలు రావు గానీ అగ్ర తాంబూలం తనకే కావాలన్నాడట అన్న చందంగా పప్పు తీరు కూడా అలాగే ఉందన్నారు. 

ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రబాబు మంత్రి ఉద్యోగం ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా అంటూ ప్రశ్నించారు. సీఎం కొడుకుకు మూడు జాబులు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల్లేవని కనీసం నోటిఫికేషన్లు కూడా లేవన్నారు. అలాంటి సీం మనకు అవసరమా అంటూ వైఎస్ షర్మిల నిలదీశారు.  

ఈ వార్తలు కూడా చదవండి

వైఎస్ మాటను గుర్తు చేసి చంద్రబాబుపై విరుచుకుపడ్డ షర్మిల