రాజమండ్రి: కష్టకాలంలో  సినీ నటుడు అలీకి తాను అండగా ఉన్నానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. స్నేహమంటే ఇదేనా అని ఆయన అలీని ప్రశ్నించారు.

సోమవారం నాడు రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్ అలీ వైసీపీలో చేరిన విషయమై స్పందించారు. ఎంపీ టిక్కెట్టు ఇస్తానంటే అలీ వైసీపీలో చేరాడని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ, వైసీపీ నేతలు అలీని వాడుకొంటున్నారని ఆయన విమర్శించారు. అలీ కష్టాల్లో ఉన్న సమయంలో తాను ఆదుకొన్నట్టుగా  ఆయన గుర్తు చేసుకొన్నారు.

తండ్రి శవం దొరకకముందే సీఎం పదవి కోసం జగన్ తాపత్రయపడ్డాడని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అలాంటి జగన్ రాష్ట్రానికి అవసరమా అని ఆయన ప్రశ్నించారు. కన్నబాబు లాంటి చెంచాలు అవసరం లేదన్నారు. జగన్ ఇంట్లో వాటాలు ఇవ్వమంటే ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

ప్రజల ఆశీస్సులున్నంత వరకు పార్టీని నడుపుతా: పవన్

ప్రచారం ఆపాలని డాక్టర్ల సూచన, ఆపనన్న పవన్: సినీ నటుడు రామ్ చరణ్