అనకాపల్లి:ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు తాను జనసేన పార్టీని నడుపుతానని  ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

ఆదివారం నాడు అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభళో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారాన్ని మానివేయాలని వైద్యులు సూచించినా కూడ  పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.

జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు నెలకు రూ.5 వేల పెన్షన్ అందిస్తామని  ఆయన ప్రకటించారు. భవిష్యత్తు తరాల కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు ఆయన వివరించారు.

ప్రతి ఇంటికి 10 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని ఆయన ప్రకటించారు. ప్రతి నెల రేషన్‌ పథకం కింద రూ.2500 నుండి 3500లను చెల్లించనున్నట్టు ఆయన వివరించారు.

 రేషన్ డీలర్లకు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పిస్తామని పవన్ కళ్యాణ్ సూచించారు.ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. సమాజాన్ని, దేశం నుండి తీసుకోవడం కాదు, సమాజానికి దేశం కోసం తిరిగి ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.

 తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. పాత పెన్షన్ విధానాన్ని  తీసుకువచ్చే బాధ్యతను తాను తీసుకొంటానని ఆయన ప్రకటించారు.

రైతు కష్టం తెలుసుకోవడానికి గతంలో  తాను తన పొలంలో వ్యవసాయం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దివ్యాంగులు ఉన్న ప్రతి ఇంటికి ప్రత్యేక పెన్షన్లు, ఇళ్లను నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

ప్రచారం ఆపాలని డాక్టర్ల సూచన, ఆపనన్న పవన్: సినీ నటుడు రామ్ చరణ్