విజయవాడ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. షుగర్ లెవల్స్ తగ్గడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.

షుగర్ లెవల్స్ తగ్గడంతో పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో జనసేన పార్టీ నేతలు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.  వైద్యులు పవన్ కళ్యాణ్‌కు చికిత్స అందిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ విస్తృతంగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకొని విజయవాడకు తిరిగివచ్చిన సమయంలో ఎయిర్‌పోర్ట్‌లోనే పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎయిర్‌పోర్ట్ నుండి పవన్ కళ్యాణ్ నేరుగా ఇంటికి వెళ్లకుండా ఆసుపత్రికి వెళ్లారు. ఎన్నికల సభలు నిర్ణీత సమయాని కంటే ఎక్కువ సమయం గడపడం వేళకు భోజనం చేయకపోవడం తదితర కారణాలతో పవన్ కళ్యాణ్‌కు షుగర్ లెవల్స్ తగ్గిపోయినట్టుగా చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

వేదికపై కిందపడిపోయిన పవన్ కళ్యాణ్