Asianet News TeluguAsianet News Telugu

వేదికపై కిందపడిపోయిన పవన్ కళ్యాణ్

ఓ అభిమాని అత్యుత్సాహం కారణంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వేదికపైనే  కిందపడిపోయారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకొంది.
 

pawan kalyan falls on the stage in vizianagaram
Author
Vizianagaram, First Published Apr 5, 2019, 5:07 PM IST

విజయనగరం: ఓ అభిమాని అత్యుత్సాహం కారణంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వేదికపైనే  కిందపడిపోయారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకొంది.

విజయనగరం జిల్లాలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.  ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడేందుకు  సన్నద్దమౌతున్న సమయంలోనే వెనుక నుండి వచ్చిన ఓ అభిమాని పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకొన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ స్టేజీపైనే కిందపడిపోయాడు. 

ఈ ఘటన కారణంగా మైక్  కూడ విరిగిపోయింది. పవన్ భద్రతా సిబ్బంది ఆయనను వెంటనే పైకి లేపారు.  వపన్ అభిమానిని అదుపులోకి తీసుకొన్నారు.  ఆ తర్వాత ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

Follow Us:
Download App:
  • android
  • ios