కళ్యాణదుర్గం: జగన్‌పై ఉన్న కేసులు ఆయనకు ప్రతిబంధ:కంగా మారాయని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

ఆదివారం నాడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలో  రాహుల్ గాంధీ పాల్గొన్నారు.ప్రధానమంత్రి మోడీని అందుకే జగన్‌ ఏమీ ప్రశ్నించలేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన ప్రకటించారు.2019 ఎన్నికల్లో కేంద్రంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా అత్యవసరమని చెప్పారు. గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీని మోడీ అమలు చేయలేదన్నారు. ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి ఇచ్చిన విభజన హామీలను కూడ అమలు చేయని విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు. 

యువతకు మోడీ ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. పేదరికంపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని ఆయన విమర్శించారు.  మోడీ దేశాన్ని పేద, సంపన్న కుటుంబాల దేశంగా మార్చారని ఆయన ఆరోపించారు. పేదల కోసం న్యాయ్ అనే పథకాన్ని  తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందిస్తామని  ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

రెండు రోజుల్లోనే రుణ మాఫీ: ఏపీకి రాహుల్ హామీ
రెండు సీట్లలో రాహుల్ పోటీ: బీజేపీ సెటైర్లు, ఓడిస్తామన్న విజయన్