విజయవాడ:ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చెప్పారు. కేంద్రంలోకి అదికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదాను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే రెండు రోజుల్లోనే రైతుల రుణాలను మాఫీ చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తామిచ్చిన హామీలను అమలు చేసినట్టు ఆయన గుర్తు చేశారు.

ఆదివారం నాడు విజయవాడలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే రెండు రోజుల్లోనే రైతుల రుణాలను మాఫీ చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తామిచ్చిన హామీలను అమలు చేసినట్టు ఆయన గుర్తు చేశారు.

ఏపీ ప్రజలకు తమ కుటుంబానికి ఆత్మీయ బంధం ఉందని  ఆయన చెప్పారు. ఈ బంధం రాజకీయ బంధం కాదన్నారు. తల్లికి, పిల్లవాడికి ఉన్న బంధం లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏపీకి ప్రత్యేక హోదాను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మళ్లీ మళ్లీ తాను చెబుతున్నా... కాంగ్రెస్ పార్టీతోనే ఏపీకి ప్రత్యేక హోదా సాద్యమని ఆయన స్పష్టం చేశారు.

మోడీ ఇచ్చిన ఒక్క హామీని కూడ ఏపీలో అమలు చేయలేదన్నారు.  ఐదేళ్ల పాటు  పాలించిన మోడీ ఏపీకి ప్రత్యేక హోదాను తుంగలో తొక్కారని రాహుల్ ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో భారత ప్రభుత్వం తరపున ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తామని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రాంతీయ పార్టీలు ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలని ఆయన టీడీపీ, వైసీపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.యూపీఏ హయాంలో తీసుకొచ్చిన  అనేక సంక్షేమ కార్యక్రమాలను ఎన్డీఏ సర్కార్ విస్మరించిందని ఆయన ఆరోపణలు చేశారు.

పేద ప్రజలను దోచి 15 మంది సంపన్నులకు దోచిపెట్టారని ఆయన మోడీపై విమర్శలు గుప్పించారు.రాఫెల్ కాంట్రాక్టును అనిల్ అంబానీకి కట్టబెట్టారని ఆయన గుర్తు చేశారు.

పేదరిక నిర్మూలనకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు.భూసేకరణ చట్టానికి కూడ ప్రభుత్వం తూట్లు పొడిచిందని చెప్పారు. రైతులు, కార్మికులపై నరేంద్ర మోడీ యుద్ధం చేస్తే తాము మాత్రం పేదరికంపై యుద్ధం చేసేందుకు సిద్దమైనట్టు ఆయన వివరించారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవారికి ప్రతి ఏటా రూ.72వేలను ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు.  దేశంలోని 20 శాతం పేదలకు ఈ ఆదాయాన్ని సమకూరుస్తామని ఆయన ప్రకటించారు. పేదల ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామని  మోడీ 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.కానీ, మోడీ మాదిరిగా తాను ప్రజలను మోసం చేయలేనని చెప్పారు. రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామని ప్రకటించిన మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు.

సంబంధిత వార్తలు

రెండు సీట్లలో రాహుల్ పోటీ: బీజేపీ సెటైర్లు, ఓడిస్తామన్న విజయన్