Asianet News TeluguAsianet News Telugu

మోడీకి అధికారం కల్ల: తిరుపతిలో మాయావతి

 ఈ ఎన్నికల్లో  కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదని  బీఎస్పీ చీఫ్  మాయావతి అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే కొత్త కొత్త వాగ్దానాలతో ప్రజలను మోసం చేసేందుకు మరోసారి ప్రజల ముందుకు ఆ పార్టీ వస్తోందని ఆమె విమర్శించారు.
 

bsp chief mayawathi slams on modi in tirupati meeting
Author
Tirupati, First Published Apr 4, 2019, 5:33 PM IST


తిరుపతి: ఈ ఎన్నికల్లో  కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదని  బీఎస్పీ చీఫ్  మాయావతి అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే కొత్త కొత్త వాగ్దానాలతో ప్రజలను మోసం చేసేందుకు మరోసారి ప్రజల ముందుకు ఆ పార్టీ వస్తోందని ఆమె విమర్శించారు.

గురువారం నాడు తిరుపతిలో జరిగిన జనసేన ఎన్నికల ప్రచార సభలో బీఎస్పీ అధినేత్రి మాయావతి పాల్గొన్నారు.ఐదేళ్ల క్రితం బీజేపీ విడుదల చేసిన వాగ్దానాల్లో ఒక్క వాగ్దానాన్ని కూడ నెరవేర్చలేదన్నారు. 

కొత్త నాటకానికి బీజేపీ తెరతీసిందని ఆమె విమర్శించారు. పాత హామీలను ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.బీజేపీ నేతలు తప్పుడు వాగ్ధానాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆమె అభిప్రాయపడ్డారు.

మోసాలతో అధికారంలోకి వచ్చిన నాటకాలు ప్రజలకు అర్ధమయ్యాయయని మాయావతి అభిప్రాయపడ్డారు. చౌకీదారు పాలనగా  బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

దేశాన్ని  కాంగ్రెస్  పార్టీ ఎక్కువ కాలం పాలించిందన్నారు.కాంగ్రెస్ తో పాటు బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడ కొన్నేళ్ల పాటు పాలించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.ఈ పార్టీలన్నీ కూడ తేశంలో సామాజిక న్యాయాన్ని సాధించేదన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారానికి దూరంగా పోయిందన్నారు.

యూపీలో 4 దఫాలు తమ పార్టీ  అధికారాన్ని చేపట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తమ పార్టీ సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. తాము అధికారంలోకి రాగానే ఏపీ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ఆమె ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

జగన్ అహంకారం దిగాలంటే...: పవన్ కళ్యాణ్


 

Follow Us:
Download App:
  • android
  • ios