పశ్చిమ గోదావరిలో తమ్ముళ్ళు రోడ్డున పడ్డారు. ఇద్దరు నేతల  మధ్య ఆధిపత్య పోరులో మధ్య, దిగువస్ధాయి నేతలు బలైపోతున్నారు. మాజీ మంత్రి, చింతలపూడి ఎంఎల్ఏ పీతల సుజాత, ఏలూరు ఎంపి మాగంటి బాబు (వెంకటేశ్వర్రావు)ల మధ్య ఎప్పటి నుండో వున్న వైరం సోమవారం రోడ్డున పడింది. పీతల సుజాత వైఖరికి నిరసనగా మాగంటి వర్గానికి చెందిన ఇద్దరు జడ్పీటీసీలు, 23 మంది ఎంపిటీసీలతో పాటు పలువురు సర్పంచులు తమ పదవులకు రాజీనామాలు చేసారు. తాజా పరిణామంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఎపి మాగంటి బాబు 2014లో కాంగ్రెస్ నుండి టిడిపిలో చేరి ఏలూరు ఎంపిగా గెలిచారు. ఇక, సుజాతేమో మొదటి నుండి టిడిపి నేతే. అయితే, ఏలూరు పార్లమెంటు పరిధిలోనే సుజాత నియోజకవర్గం చింతలపూడి కూడా ఉండటంతో మొదటి నుండి ఇద్దరికి ఉప్పు-నిప్పులాగ ఉంది. దాదాపు మూడేళ్ళు మంత్రిగా పనిచేసినపుడు ఎంపి వర్గాన్ని బాగా ఇబ్బందులు పెట్టినట్లు సుజాత పై పలు ఆరోపణలున్నాయి. ఎప్పుడైతే మంత్రివర్గంలో నుండి సుజాతకు ఉధ్వాసన వచ్చిందో అప్పటి నుండి పలుమార్లు వీరిద్దరి మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి.

జిల్లా ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సమక్షంలో ఈమధ్యే సుజాత-ఎంపి వర్గాలు బాహాటంగానే కలబడ్డాయి. దాంతో మంత్రి కలగజేసుకుని సయోధ్య కుదురుద్దామని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు దృష్టికి కూడా చేరింది. చంద్రబాబు మాత్రం ఎన్ని జిల్లాలని చూసుకుంటారు. అందుకే పశ్చిమగోదావరిపై పెద్దగా దృష్టి సారించినట్లు లేదు. దాని ఫలితమే సొమవారం మూకుమ్మడి రాజీనామాలు. సరే రాజీనామాలు ఉపసంహరించుకుంటారా లేదా అన్నది వేరే సంగతి. పోయిన ఎన్నికల్లో ఇదే జిల్లా టిడిపి, భాజపాకు ఏకపక్షంగా 15 సీట్లూ కట్టబెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. మరి, రేపటి ఎన్నికల్లో అదే పరిస్ధితి ఉందా అంటే అనుమానమే?

సాధారణ ఎన్నికలకు మహా అయితే ఏడాదిన్నర కాలముంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలతో తమ్ముళ్ళు బిజీగా ఉంటున్నారు. చంద్రబాబు చెప్పినా ఎవ్వరు వెనక్కు తగ్గటం లేదు. ఫిరాయింపు ఎంఎల్ఏలు, కాంగ్రెస్ నుండి వచ్చిన వలస నేతలతో తమ్ముళ్ళకు ఏమాత్రం పడటం లేదన్నది వాస్తవం. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విభేదాలు రోడ్డున పడుతుంటే ఏం చేయాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు.