హైదరాబాద్: అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గురువారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటున్న వార్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఎంపీ అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ వస్తున్న వార్తలు నిజమేనని ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 

గురువారం సాయంత్రం లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. అవంతి శ్రీనివాస్ తోపాటు మరో ఎంపీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలిపారు. 

ఆ విషయం తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసునని సెటైర్ వేశారు. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న వైసీపీ బీసీ గర్జన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈనెల 17న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జన సభ నిర్వహించనుంది. ఆ సమావేశంలో బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు వైఎస్ జగన్.   

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపికి అవంతి రాజీనామా: సబ్బం హరికి లైన్ క్లియర్

త్యాగానికి గంటా రెడీ: టీడీపీ నేతల టచ్ లోకి రాని అవంతి

టీడీపీకి అవంతి రాజీనామా, రేపు జగన్‌ను కలిసే అవకాశం

చంద్రబాబుకు మరో షాక్: వైసీపీలోకి అవంతి, ముహూర్తం ఖరారు

చంద్రబాబుకు మరో షాక్: వైసీపీలోకి అవంతి, ముహూర్తం ఖరారు

టీడీపీకి మరోషాక్: వైసీపీలోకి సిట్టింగ్ ఎంపీ..?