అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గురువారం నాడు టీడీపీకి రాజీనామా చేశారు. రేపు లేదా ఎల్లుండి  ఆయన  వైసీపీలో చేరే అవకాశం ఉంది. 

విశాఖపట్టణం: అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గురువారం నాడు టీడీపీకి రాజీనామా చేశారు. రేపు లేదా ఎల్లుండి ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఇవాళ టీడీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో భీమిలి నుండి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది.

భీమిలి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అవంతి శ్రీనివాస్ భావిస్తున్నారు. 2009 లో ఈ స్థానం నుండి అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఆ ఎన్నికల్లో ఆయన పీఆర్పీ నుండి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ అనకాపల్లి నుండి ఎంపీగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

గత ఎన్నికల్లో భీమీలి అసెంబ్లీ స్థానం నుండి గంటా శ్రీనివాసరావు టీడీపీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో భీమిలి నుండే పోటీ చేయాలని గంటా శ్రీనివాసరావు ప్లాన్ చేసుకొంటున్నారు. అయితే భీమిలి నుండి పోటీ చేసే అవకాశం అవంతికి దక్కదని భావించిన నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్‌బై చెప్పారు.

రేపు అవంతి శ్రీనివాస్ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను హైద్రాబాద్‌లో కలవనున్నారు. అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరుతారు. విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ నేతలను జగన్ హైద్రాబాద్ రావాలని ఆదేశించారు.విశాఖకు చెందిన నేతలు శుక్రవారం నాడు హైద్రాబాద్ కు రానున్నారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు మరో షాక్: వైసీపీలోకి అవంతి, ముహూర్తం ఖరారు