టిడిపి, వైసీపి కార్యకర్తల మధ్య గొడవ, భయంతో వైసిపి నేత ఆత్మహత్య

ysrcp supporter commits suicide in kadapa
Highlights

అధికార టిడిపి, వైసిపి పార్టీల మధ్య గొడవ ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమయ్యింది. ఈ దుర్ఘటన రాయలసీమలోని కడప జిల్లాలో చోటుచేసుకుంది. అధికార పార్టీ నేతలు పోలీసుల ద్వారా బెదిరింపులకు దిగడమే ఈ ఆత్మహత్యకు కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

కడప జిల్లాలోని వేంపల్లె మండలం తంగేడుపల్లికి చెందిన శ్రీకాంత్(26) అనే యువకుడు వైసిపి పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. అయితే రెండు రోజుల క్రితం ఓ స్థలం విషయంలో గ్రామంలోని టిడిపి, వైసీపి వర్గీయుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో శ్రీకాంత్ ప్రమేయం కూడా ఉంది. దీంతో పోలీసులు ఇతన్ని నిందితుడిగా చేర్చారు.

అయితే పోలీసులకు భయపడిన శ్రీకాంత్ ఊరు వదిలి పరారయ్యాడు. దీంతో అతడి సోదరున్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు విచారించారు. దీంతో ఈ విషయం తెలిసి మరింత భయపడిపోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఈ ఆత్మహత్యతో గ్రామంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీ వర్గీయుల మధ్య ఎలాంటి ఘర్షణ చెలరేగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అధికార పార్టీ నాయకులు పోలీసుల ద్వారా బెదిరించడం వల్లే శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు, వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. 

loader