రఘరామకృష్ణంరాజుకి షోకాజ్ నోటీస్, పార్క్ హయత్ హోటల్‌ మీలాఖత్‌లపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు.

బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  రఘురామకృష్ణంరాజుకి ఎంపీ పదవీ కానీ, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవీ ఏదైనా సరే సీఎం జగన్, వైసీపీ పార్టీ వల్లే వచ్చాయని గుర్తుంచుకోవాలని అన్నారు.

పార్టీ కట్టుబాట్లకు అందరూ కట్టుబడి ఉండాలని, క్రమశిక్షణతో మెలగాలని వీటికి భంగం కలిగిస్తున్నారు కాబట్టే రఘురామకృష్ణంరాజుకి షోకాజ్ నోటీసు ఇచ్చామన్నారు. అసభ్యకరమైన పోస్టులు ఎవరైనా పెడితే పార్టీలకు అతీతంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Also Read:నిమ్మగడ్డ కలిస్తే వైసీపీ ఎందుకు భయపడుతోంది: సుజనా కామెంట్స్

పోస్టులు పెడుతున్న వారికి అక్కాచెల్లెళ్లు, తల్లి, భార్య ఉంటారన్న విషయాన్ని వాళ్లు గుర్తుంచుకోవాలని విజయసాయిరెడ్డి హితవు పలికారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చేసిన పనుల వల్ల రాజ్యాంగ పదవిలో ఆయన ఉండటానికి అనర్హుడని ఆయన విమర్శించారు.

చంద్రబాబుకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కావాలి తప్పించి ప్రజాస్వామ్యం కాదన్న ఆయన.. ఎన్నికల కమీషనర్‌ను తోలుబొమ్మలాగా పెట్టుకుని రాజ్యాంగ సంక్షోభం సృష్టించేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విజయసాయి ఆరోపించారు.

Also Read:రహస్య సమావేశం కాదు, నిమ్మగడ్డతో కుటుంబ స్నేహం: సుజనా

ప్రతిపక్షనేతకు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ సహకరిస్తున్నారని ఎద్దేవా చేశారు. వ్యాపార లావాదేవీల గురించి చర్చించామంటున్న సుజనా చౌదరితో నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు.