అమరావతి: తాను ఎలాంటి రహస్య సమావేశాలు నిర్వహించలేదని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు.

ఈ నెల 13 వ తేదీన హైద్రాబాద్ పార్క్ హయత్ హోటల్ లో ఏపీ రాష్ట్రానికి చెందిన మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, మాజీ మంత్రి  కామినేని శ్రీనివాస్ తో సమావేశం కావడంపై ఆయన  మంగళవారం నాడు వివరణ ఇచ్చారు.

also read:కామినేని, సుజనాలతో భేటీ: అడ్డంగా దొరికిన నిమ్మగడ్డ, చంద్రబాబు ట్విస్ట్

అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. పార్క్ హయత్ హోటల్లో తన కార్యాలయం ఉందని ఆయన వివరణ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో తన కార్యాలయాన్ని పార్క్ హయత్ కు మార్చినట్టుగా ఆయన తెలిపారు.

తనను కలిసేందుకు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అపాయింట్ మెంట్ తీసుకొన్నారని ఆయన గుర్తు చేశారు.నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో తనకు  కుటుంబ స్నేహం ఉందన్నారు. ఈ మేరకు ఆయన రెండు వేర్వేరు ప్రెస్ నోట్లను విడుదల చేశారు. 

ఏపీ రాజకీయాల గురించి కామినేని శ్రీనివాస్ తో మాట్లాడినట్టుగా ఆయన వివరించారు. తాను ఎలాంటి రహస్య సమావేశాలు నిర్వహించలేదన్నారు. ఇవేమీ చట్ట వ్యతిరేక సమావేశాలు కాదని ఆయన తేల్చి చెప్పారు

తనను కలవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడ అదే రోజున అడిగారన్నారు. తాను ఓపెన్ పర్సన్.. పారదర్శక రాజకీయాలే చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
తనపై అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు.

కామినేని శ్రీనివాస్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ లు వేర్వేరుగా తనను కలిసినట్టుగా ఆయన వివరించారు.బురద రాజకీయాల్లో పడి తాను బురదను అంటించుకోనని ఆయన తెలిపారు. ఈ సమావేశాలు చట్ట వ్యతిరేకమైన సమావేశాలు కావని ఆయన తేల్చి చెప్పారు.