వైసీపీ ఎంపీలపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ  కృష్ణంరాజు తన మాటల దాడిని ఆపడం లేదు. ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థాయిలో తాను లేనని .. తన ఒంటిపై చేయి పడితే రక్షించేందుకు హేమాహేమీలున్నారని ఆయన హెచ్చరించారు.

న్యాయవ్యవస్థలను భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని రఘురామ వ్యాఖ్యానించారు. తనను అనర్హుడిగా ప్రకటిండమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని, అయితే తనను బహిష్కరించే దమ్ము లేదని ఆయన తేల్చిచెప్పారు.

Also Read:జగన్ ప్రభుత్వంపై రఘురామకృష్ణమ రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు

తోలు తీయడం తన వృత్తి కాదని, అలా మాట్లాడటం  కాస్తో, కూస్తో వచ్చినా నాలో నేను మాట్లాడతాను కానీ ప్రజలు అసహ్యించుకునేలా మాట్లాడనని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. సంస్కార వంతులు.. సంస్కారాన్ని గౌరవించే వాళ్లు, విజ్ఞులు అయిన వాళ్లు 90శాతం ఉన్నారని ఆయన గుర్తుచేశారు.  

వాళ్లు నా మాట వినండి. అలాంటి తోలు తీసే చేష్టలకు, తగిన సమాధానం చెప్పే స్నేహితులు నాకున్నారని నర్సాపురం ఎంపీ వెల్లడించారు. ఎంపీ రాజా భయ్యా.. నాకు మంచి స్నేహితుడు. అసలు పేరు  రఘు రాజ్ ప్రతాప్ అని చెప్పారు.

తన ఒంటిపై చిన్న చేయి పడితే, తనను కాపాడగలిగే వ్యక్తులు, స్నేహితులు రాయలసీమలో కూడా ఉన్నారని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. చివరికి పులివెందులలో కూడా తనకు స్నేహితులున్నారని తెలిపారు. పదివేల మందితో పులివెందులలో సభ పెట్టగలను. కరోనా తగ్గిన తర్వాత చూద్దాం. న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది’’ అని ఆయన చెప్పారు.