అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై వైసీపీ తిరుగుబాటు పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణమ రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థను తప్పు పట్టడం సరి కాదని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థపై పార్లమెంటు లోపల, బయట జరుగుతున్న దాడిని ఆయన ఖండించారు .

పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనలు చేస్తున్న వైసీపీ ఎంపీలపై కూడా ఆయన మాట్లాడారు. ఏదైనా తప్పు జరిగితే చిల్లర అల్లరి సరి కాదని ఆయన అన్నారు. న్యాయ వ్యవస్థపై దాడికి మించిన అన్యాయం మరొకటి ఉండదని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టులు తప్పు పడుతున్నాయని తమ ఎంపీలు అంటున్నారని ఆయన అన్నారు. 

ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉండడం వల్లనే కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయని ఆయన అన్నారు. పార్టీ జెండాలో మూడు రంగులున్నాయని చెప్పి ప్రభుత్వ కార్యాలయాలకు ఆ రంగులు వేస్తే కోర్టు ఎలా సమర్థిస్తుందని రఘురామ కృష్ణమ రాజు ప్రశ్నించారు. 

హైకోర్టులో దాన్ని కొట్టేశారని, సుప్రీంకోర్టులోనూ అదే జరిగిందని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగంపై గౌరవం లేదని, ఏమన్నా అంటే 151 సీట్లు అంటారని ఆయన అన్నారు. ఆర్టికల్ 351కి వ్యతిరేకంగా వెళ్తే కుదరదని ఆయన అన్నారు. ఇంగ్లీష్ మీడియం, మైనింగ్ రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు చెప్పిందని, సుప్రీంకోర్టులోనూ అదే జరిగిందని ఆయన అన్నారు. 

రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంటులో మూడో వంతు బలం ఉండాలని, అసెంబ్లీలో ఉంటే సరిపోదని, అప్పుడు ఇష్టం ఉన్నట్లు వాళ్లు రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చునని ఆయన అన్నారు. చట్టం తెలిసిన వాళ్లు ఉంటే ఇలాంటి పరిస్థితి రాదని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థపై  ఈ పుస్తకాలేమిటో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. 

న్యాయవ్యవస్థకు అత్యున్నత గౌరవం ఇవ్వాలని, మనం తీసుకున్న నిర్ణయాలకు హైకోర్టు ఎందుకంటారని ఆయన అన్నారు. ప్రత్యేగో ఉండదని ఆయన స్పష్టం చేశారు. రైల్వే జోన్, దేవాలయాలపై మాట్లరని ఆయన అన్నారు. గత ప్రబుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తిరిగి సమీక్షించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం తప్పు అని ఆయన అన్నారు. మనమూ ఓ రోజు గత ప్రభుత్వం అవుతామని ఆయన చెప్పారు. తిరిగి సమీక్ష తగదని పంజాబ్, హర్యానా గొడవల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. తనను బహిష్కరించే దమ్ములు లేవని ఆయన అన్నారు.