అమరావతి: పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్టుగా  అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

గురువారం నాడు అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  బుధవారం నాడు టీడీపీ సమీక్ష సమావేశంలో పోలీసులపై అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వెన్నెముక లేకుండా వంగిపోతున్నారని విమర్శించారు. తాను ఏ ఒక్క పోలీసును కూడ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదన్నారు.

Also read:మా బూట్లు నాకే పోలీసులను తెచ్చుకొంటాం, జగన్ మరో రాజారెడ్డి: జేసీ సంచలనం

పోలీస్ అసోసియేషన్ నేతల ఒత్తిడి వల్లే  పోలీసులు మాట్లాడుతున్నారని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తన అభిప్రాయాలతో పోలీసులు కూడ ఏకీభవిస్తున్నారని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

తాను మీ మధ్య పుట్టాను. మీరు నా మధ్యే పుట్టి పెరిగారని జేసీ దివాకర్ రెడ్డి గుర్తు చేశారు. తాను ఏ ఒక్కరిని కూడ కించపర్చలేదన్నారు. అంతేకాదు ఏ ఒక్కరిని కనూడ అవమానపర్చేందుకు కూడ సిద్దంగా లేనని తేల్చి చెప్పారు.కొందరు పనికిరాని పోలీసులపై తాను ఈ వ్యాఖ్యలు చేశానని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టుగా జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. 

అసెంబ్లీ, పరిపాలన విభాగాలు  రెండూ కూడ ఒకే చోట ఉండాల్సిన అవసరం ఉందని  జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.  వేర్వేరు చోట్ల రాజధానులు పెట్టే అవివేకుడు జగన్ కాదని  జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.