ఆయన సలహాలు.. ట్రంప్‌కి కావాలేమో, జగన్‌కి అక్కర్లేదు: బాబుపై రోజా విసుర్లు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ ఆర్‌కే రోజా మండిపడ్డారు. బుధవారం చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు తనను గెలిపించిన ప్రజలను గాలికి వదిలేసి ఆంధ్ర నుంచి అమెరికా వరకు సలహాలివ్వడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు

YSRCP MLA Roja slams tdp chief chandrababu naidu over coronavirus pandemic

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ ఆర్‌కే రోజా మండిపడ్డారు. బుధవారం చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు తనను గెలిపించిన ప్రజలను గాలికి వదిలేసి ఆంధ్ర నుంచి అమెరికా వరకు సలహాలివ్వడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు సలహాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అవసరమేమో గానీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదని రోజా తేల్చిచెప్పారు. ఏ రాష్ట్రంలో చేయని పనులు జగన్‌ ప్రభుత్వం చేస్తూ దేశానికే ఆదర్శంగా పరిపాలన కొనసాగిస్తున్నామని ఆమె తెలిపారు.

Also Read:అనంతలో 7 కొత్త కరోనా కేసులు: హిందూపురంలో డాక్టర్లకు పాజిటివ్

వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ అన్ని విధాలా అభినందనీయమని రోజా ప్రశంసించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వారిని, ఢిల్లీకి వెళ్లివచ్చిన వారిని గుర్తించడంలో వాలంటరీ వ్యవస్థ ఆదర్శనీయంగా పనిచేస్తోందని రోజా తెలిపారు.

రాష్ట్రంలో 7 వైరస్ ల్యాబ్స్ పెట్టి కరోనా వ్యాధిని కట్టడి చేస్తున్నారని ఆమె చెప్పారు. ఈ మహమ్మారిని ఆరోగ్యశ్రీ కింద చేరుస్తూ 12 వేల రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డికి రోజా ధన్యవాదాలు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో కొత్తగా ఏడు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరుకున్నాయి. మక్కా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు అనంతపురంలో కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

Also Read:కరోనా నుండి ప్రజల దృష్టి మరల్చడానికే... ఆ నిర్ణయం సరైనదే: సజ్జల

అలాగే, కల్యాణదుర్గం నుంచి ఢిల్లీలో జరిగిన జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. కాగా, ఇటీవల హిందూపురంలో కరోనా వైరస్ పాజిటివ్ తో ఓ వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తికి చికిత్స అందించిన ఇద్దరు వైద్యులకు, ఇద్దరు నర్సింగ్ స్టాఫ్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిందని కలెక్టర్ చంద్రుడు చెప్పారు.   

ఇదిలావుంటే, తిరుమల శ్రీవారి సన్నిధిలోని వేద పాఠశాలలో కరోనా కలకలం చెలరేగింది. ముగ్గురు వేద విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని అశ్విని ఆస్పత్రికి తరలించారు. ఓ విద్యార్థికి కరోనా లక్షణాలు ఉండడంతో రుయా ఆస్పత్రికి పంపించారు. విద్యార్థులు గత నెలలో మహారాష్ట్రకు వెళ్లినట్లు సమాచారం. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios