Asianet News TeluguAsianet News Telugu

వైసిపి ఎమ్మెల్యేలమంతా నారా భువనేశ్వరి పాదాలను కన్నీళ్ళతో కడుగుతాం: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గురించి అధికార వైసిపి సభ్యులు అసభ్యకరంగా మాట్లాడారంటూ జరుగుతున్న వివాదంపై స్పందిస్తూ వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

ysrcp mla rachamallu shivaprasad reddy intresting comments nara bhuvaneshwari issue
Author
Amaravathi, First Published Dec 5, 2021, 8:01 AM IST

కడప: నిండు అసెంబ్లీలో అధికార వైసిపి సభ్యులు తన భార్య భువనేశ్వరిపై అసభ్యకరంగా మాట్లాడుతూ అవమానించారంటూ టిడిపి అధ్యక్షులు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదనకు లోనయిన  విషయం తెలిసిందే. అయితే నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశి క్షమాపణలు కూడా చెప్పారు. దీంతో ఈ వివాదం సద్దుమణుగుతుందని బావిస్తున్న తరుణంలో కడప జిల్లా ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

మాజీ సీఎం chandrababu naidu భార్య భార్య nara bhuvaneshwari ని వైసిపి ఎమ్మెల్యేలమంతా సోదరి సమానురాలిగా చూస్తామని rachamallu shivaprasad reddy పేర్కొన్నారు. ఆమెపై vallabhaneni vamsi చేసిన అనుచిత వ్యాఖ్యలను తోటి ఎమ్మెల్యేలుగా మేమంతా తప్పుబట్టామన్నారు. అయితే వంశీ ysrcp పార్టీ ఎమ్మెల్యే కాదు... అయినా వైసిపి నాయకులు భువనేశ్వరి గురించి తప్పుగా మాట్లాడారని ప్రచారం చేసారని పేర్కొన్నారు. ఇకనైనా ఈ తప్పుడు ప్రచారం నిలిపివేయాలని ఎమ్మెల్యే రాచమల్లు సూచించారు. 

వైసిపి నాయకులు తమ ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, సీఎం జగన్ తల్లి విజయమ్మ తో సమానంగా నారా భువనేశ్వరిని గౌరవిస్తామని రాచమల్లు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలతో భువనేశ్వరి బాధపడివుంటే వైసిపి ఎమ్మెల్యేలమంతా కలిసి ఆమె పాదాలను కన్నీళ్ళతో కడుగుతామంటూ వైసిపి ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

read more  ఇది ప్రాజాస్వామ్యమా? అవ్వను అవమానించారు: రాష్ట్ర సర్కారుపై టీడీపీ ఫైర్

చంద్రబాబు నాయుడు ఇకపై కేవలం రాజకీయాల కోసం తన భార్యకు అవమానం జరిగిందంటూ విషయాన్ని మరింత పెద్దది చేయడం తగదన్నారు. ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ సూచించారు.   

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు రాజకీయ దూమారాన్ని రేపిన విషయం తెలిసిందే. తన కుటుంబాన్ని అసెంబ్లీ లో అవమానించారని... ముఖ్యంగా తన భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ టిడిపి చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. వైసిపి నాయకులు సభలో ప్రవర్తించిన తీరును రాష్ట్ర ప్రజలకు వివరిస్తూ మీడియా ఎదుటే చంద్రబాబు భోరున విలపించారు. దీంతో భగ్గుమన్న టిడిపి శ్రేణులు అధికార పార్టీ తీరుకు ఆందోళనలు చేపట్టారు. 

తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నారా భువనేశ్వరికి క్షమాపణ చెప్పారు. ఇకనైనా ఈ వివాదాన్ని ముగిస్తారా? పొడిగిస్తారా? వల్లభనేని వంశీ ప్రశ్నించారు. ఆవేశంతో పొరపాటున కొన్ని వ్యాఖ్యలు చేశానని వంశీ ప్రకటించారు. తాను అన్నది 5 శాతమే అయితే చంద్రబాబే 95 శాతం రాద్ధాంతం చేశారన్నారు. వేరే వర్గాలను తిట్టి అనవసర సామాజిక అశాంతిని రేపుతున్నారని వల్లభనేని వంశీ చెప్పారు. 

read more  చంద్రబాబు డైరెక్షన్‌లోనే: మల్లాది వాసు వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ కౌంటర్, భువనేశ్వరికి క్షమాపణ

ఇదిలావుంటే ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు మధిరలో చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.  Vallabhaneni Vamsi , kodali nani, Ambati Rambabu లను భౌతికంగా నిర్మూలించాలని, ఇందుకు తన వంతుగా ఆర్ధిక సహాయం చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో టీఆర్ఎస్ కౌన్సిలర్‌గా వున్న మల్లాది వాసు కమ్మ సంఘం వన సమారాధనలో ఈ వ్యాఖ్యలు చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios