Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు డైరెక్షన్‌లోనే: మల్లాది వాసు వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ కౌంటర్, భువనేశ్వరికి క్షమాపణ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీఆర్ఎస్ కౌన్సిలర్ మల్లాది విష్ణు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే ఇదంతా నడుస్తుందన్నారు. 

Gannavaram MLA Vallabhaneni Vamsi Reacts on Malladhi Vishnu Comments
Author
Guntur, First Published Dec 1, 2021, 8:00 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి:సమాజానికి ఎంతో సేవ చేస్తున్న సామాజిక వర్గాన్ని  కుట్రలు, కుతంత్రాల వైపు చంద్రబాబు నడుపుతున్నారని  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు. టీఆర్ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు  మధిరలో చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.  Vallabhaneni Vamsi , kodali nani, Ambati Rambabu లను భౌతికంగా నిర్మూలించాలని, ఇందుకు తన వంతుగా ఆర్ధిక సహాయం చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు.ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో టీఆర్ఎస్ కౌన్సిలర్‌గా వున్న మల్లాది వాసు కమ్మ సంఘం వన సమారాధనలో ఈ వ్యాఖ్యలు చేశారు.  ఈ వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ స్పందించారు.Malladi Vaasu లాంటి వారిని వివిధ పార్టీల్లో పోషించేది Chandrababu  ఆయన ఆరోపించారు. చంద్రబాబు Kamma కులానికి పట్టిన చీడ పురుగు అని ఆయన వ్యాఖ్యానించారు. 

తెలంగాణలో Tdp బతికి బట్టకట్టే పరిస్థితి లేదన్నారు. Andhra pradesh లో కూడా ఆశాజనకమైన పరిస్థితులు లేవన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైందన్నారు. కుప్పం సహా అన్ని స్థానాల్లో ఆ పార్టీ ఓటమి పాలు కావడంతో కులాన్ని తెర మీదికి తెచ్చి రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. గతంలో మతం పేరుతో రాజకీయాలు చేశారని వల్లభనేని వంశీ గుర్తు చేశారు.  ఎవరూ ఏం మాట్లాడినా చంద్రబాబు, లోకేష్ ల ఆలోచనలు ప్రతిబింబించేలా మాట్లాడుతున్నారని వల్లభనేని వంశీ విమర్శించారు. 

also read:కొడాలి నాని, వంశీలను లేపేస్తే.. రూ.50 లక్షల రివార్డ్ : టీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఈ ఏడాది నవంబర్ 19న జరిగిన ఏపీ అసెంబ్లీ పరిణామాలతో చంద్రబాబు నాయుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన ఆవేదనను రాష్ట్రప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలోనే భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా సమావేశంలోనే ఆయన బోరున విలపించారు.  తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అసెంబ్లీలో  మాట్లాడే సమయంలో తనకు మైక్ ఇవ్వనందుకు నిరసనగా అసెంబ్లీ నుండి బయటకు వచ్చారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలోనే చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. తాను సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు ప్రకటించారు. అయితే చంద్రబాబు అసెంబ్లీకి హాజరు కాకపోయినా టీడీపీ సభ్యులు హాజరు కానున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ సభ్యులు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారు.అయితే ఈ వ్యాఖ్యలు సభలో తమ సభ్యులు ఎవరూ కూడా చేయలేదని సీఎం  జగన్ ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ పార్టీ సభ్యులు ఎవరూ కూడా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు  చేయలేదన్నారు.

వల్లభనేని వంశీకి అరికెపూడి గాంధీ కౌంటర్

మల్లాది వాసు విమర్శలు చేసిన సభలో తాను లేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే Arekapudi gandhi అన్నారు. తనపై  వల్లభనేని వంశీ విమర్శించారని ఆయన గుర్తు చేశారు.ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఒక్క సామాజిక వర్గమే కాదు సమాజం మొత్తం ఈ వ్యాఖ్యలను ఖండించిందని ఆయన చెప్పారు.  ఈ వ్యాఖ్యలు ఎవరూ చేసినా తప్పేనని అరికెపూడి గాంధీ చెప్పారు. తప్పు ఎవరూ చేసిన తప్పేనని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు ఎవరూ కూడా చేయవద్దని ఆయన కోరారు. 

నారా భువనేశ్వరికి వల్లభనేని వంశీ క్షమాపణ

నారా భువనేశ్వరికి క్షమాపణ చెబుతున్నానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. ఇక్కడితో వివాదాన్ని ముగిస్తారా? పొడిగిస్తారా? వల్లభనేని వంశీ ప్రశ్నించారు. ఆవేశంతో పొరపాటున కొన్ని వ్యాఖ్యలు చేశానని వంశీ ప్రకటించారు.తాను అన్నది 5 శాతమే చంద్రబాబే 95 శాతం రాద్ధాంతం చేశారన్నారు.వేరే వర్గాలను తిట్టి అనవసర సామాజిక అశాంతిని రేపుతున్నారని వల్లభనేని వంశీ చెప్పారు. కార్తీక భోజనాల్లో మన కులం ఆధిపత్యమే కొనసాగాలన్న విష సంస్కృతి మొదలైందన్నారు. చంద్రబాబు కమ్మ కులానికి ఆదిపురుషుడేమీ కాదన్నారు. చంద్రబాబు తర్వాత కమ్మ కులం ఉండదా అని ఆయన ప్రశ్నించారు. వేరే రాష్ట్రంలో ఏం చేసినా చెల్లుతుందన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. తనకు వస్తున్న బెదిరింపుల వెనుక చంద్రబాబు హస్తం ఉందని వంశీ ఆరోపించారు.  తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని  వల్లభనేని వంశీ తేల్చి చెప్పారు.. ఓ టీవీ చర్చ సందర్భంగా కూడా ఆయన క్షమాపణలు చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios