ఈ సభ అవసరమా అని 70 ఏళ్లనాడే అన్నారు: ధర్మాన ప్రసాదరావు
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై మండలిలో జరిగిన పరిణామాలపై వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. 70 ఏళ్ల నాడే ఆచార్య ఎన్జీ రంగా పెద్దల సభ అవసరం లేదని చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై మండలిలో జరిగిన పరిణామాలపై వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. 70 ఏళ్ల నాడే ఆచార్య ఎన్జీ రంగా పెద్దల సభ అవసరం లేదని చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. ప్ర
జలు ఎన్నుకున్న సభ ఆమోదించిన చట్టాలను శాసనమండలి ఎలా అడ్డుకుంటుందని ధర్మాన ప్రశ్నించారు. నాలుగు నెలల కాలం వరకు ఏ బిల్లునైనా సెలెక్ట్ కమిటీకి పంపితే ఆపగలరని.. ఇది ఇది మంచి పద్ధతి కాదని ప్రసాదరావు తెలిపారు.
Also Read:29 గ్రామాల్లో పూలు పడినా.. 30వ గ్రామంలో రాళ్లవర్షమే: బాబుపై కన్నబాబు వ్యాఖ్యలు
ఇలా చూసీ చూడనట్లు పోతుంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేయలేరని, ప్రభుత్వం పరుగులు తీయాలనుకుంటే పెద్దల సభ అడ్డుపడుతుందని ప్రసాదరావు గుర్తుచేశారు.
ప్రభుత్వాన్ని నడనివ్వకుండా చేయడం కోసం ఇలాంటి దురుద్దేశాలకు ఎప్పుడూ ఒడిగడుతూనే ఉంటారని, మండలిని కొనసాగించాలా..? వద్దా అన్న విషయంపై ఆలోచించాలని ముఖ్యమంత్రిని ధర్మాన కోరారు.
అంతకుముందు సంఖ్యాబలం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారని.. అంతేకాకుండా ఛైర్మన్‌ను ప్రభావితం చేశారని ఆయన మండిపడ్డారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై చర్చించిన తర్వాత అసెంబ్లీ ఆమోదించి అనంతరం వాటిని మండలికి పంపిందన్నారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
బుధవారం సాయంత్రం మండలిలో జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో మాట్లాడిన ఆయన... మండలికి చేరిన బిల్లును చర్చించిన తర్వాత ఆమోదించడమో లేదంటే తిరస్కరించడమో చేయాలన్నారు. కానీ రూల్ నెం.71 అనే అంశాన్ని అడ్డం పెట్టుకుని బిల్లును చర్చకు రానీయకుండా చేశారని మంత్రి ఆరోపించారు.
Also Read:మెజార్టీ ఉందని ఇష్టమొచ్చినట్లు చేశారు: మండలి పరిణామాలపై బుగ్గన వ్యాఖ్యలు
బీఏసీ సమావేశంలో రెండు బిల్లులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపామని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ బిజినెస్ గురించే సభలో మెజార్టీ అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలన్నారు. రూల్ నెం.71 అంటే ప్రభుత్వ పాలసీపై చర్చించి దానిపై అభిప్రాయాలు మాత్రమే తెలియజేసేందుకే ఈ నిబంధనను తీసుకొచ్చారని బుగ్గన పేర్కొన్నారు.
రెండు బిల్లులను పరిగణనలోనికి తీసుకుంటున్నట్లు ఛైర్మన్ ప్రకటించారని కానీ... సెలక్ట్ కమిటీకి పంపాల్సిందిగా టీడీపీ సభ్యులు కోరారని మంత్రి చెప్పారు. మండలిలో నిబంధనలకు విరుద్ధంగా చర్చించామని ఛైర్మన్ అన్నారని బుగ్గన ప్రస్తావించారు. శాసనసభ బిల్లును మండలికి పంపిస్తే చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.