Asianet News TeluguAsianet News Telugu

పార్థసారథితో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఎలీజా, జంగా భేటీ: ఏం జరుగుతుంది?


మాజీ మంత్రి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథితో ఇద్దరు వైఎస్ఆర్‌సీపీ నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 Ysrcp leaders  Eliza and janga krishna Murthy meet former minister kolusu parthasaraty lns
Author
First Published Jan 18, 2024, 1:39 PM IST

విజయవాడ: మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథితో  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ)కి చెందిన  ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు  గురువారం నాడు భేటీ కావడం ప్రాధాన్యత  సంతరించుకుంది.

మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఈ నెల  21వ తేదీన తెలుగు దేశం పార్టీలో చేరనున్నారు. పెనమలూరు  నుండి కొలుసు పార్థసారథికి వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు  కేటాయించే విషయంలో  ఆ పార్టీ నాయకత్వం  నిరాసక్తతను వ్యక్తం చేసింది. దీంతో  తెలుగుదేశం పార్టీ వైపు  కొలుసు పార్థసారథి  చూస్తున్నారు. ఇప్పటికే  తెలుగు దేశం పార్టీ నేతలతో  పార్థసారథి చర్చించారు. పార్థసారథి తెలుగు దేశంలో చేరికకు ఆ పార్టీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల  21న పార్థసారథి తెలుగు దేశంలో చేరనున్నారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి ఎమ్మెల్యే  ఎలీజాకు కూడ వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు దక్కే అవకాశం లేదనే ప్రచారం సాగుతుంది. దీంతో  ఆయన  పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.వైఎస్ఆర్‌సీపీని ఎలీజా  కూడ  వీడుతారనే  ప్రచారం కూడ లేకపోలేదు.  అయితే  ఇవాళ మాజీ మంత్రి పార్థసారథితో  ఎలీజా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

మరో వైపు  పల్నాడు జిల్లాలోని గురజాల అసెంబ్లీ నుండి ఎమ్మెల్సీ  జంగా కృష్ణమూర్తి ఆశిస్తున్నారు. అయితే  జంగా కృష్ణమూర్తి కూడ పార్థసారథితో భేటీ కావడం  చర్చకు తావిస్తుంది.  పార్థసారథితో భేటీ అయిన ఇద్దరు వైఎస్ఆర్‌సీపీ నేతలు కూడ  టిక్కెట్టు దక్కదనే సంకేతాలు ఉన్నట్టు ప్రచారం సాగుతుంది.ఈ తరుణంలో వీరిద్దరి భేటీ ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారి తీసింది. 

also read:బీజేపీకి పురంధేశ్వరి, కాంగ్రెస్‌కు వై.ఎస్. షర్మిల: రెండు జాతీయ పార్టీలను లీడ్ చేస్తున్న ఉద్ధండుల కూతుళ్లు

మాజీ మంత్రి పార్థసారథితో భేటీలో రాజకీయ ప్రాధాన్యత లేదని  వైఎస్ఆర్‌సీపీ నేతలు  చెబుతున్నారు.  మర్యాదపూర్వకంగానే  ఈ భేటీ జరిగిందని  వైఎస్ఆర్‌సీపీ నేతలు చెబుతున్నారు.  అయితే  ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

also read:వై.ఎస్. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు: సవాళ్లు ఇవీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వచ్చే ఎన్నికల్లో  175 అసెంబ్లీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా  వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ చేస్తుంది.ఈ క్రమంలోనే  సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మారుస్తున్నారు.  ఇప్పటికే  సుమారు  సుమారు  60 అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్ లను  ఆ పార్టీ నాయకత్వం మార్చింది. సీట్లు దక్కని వారంతా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios