త్వరలోనే విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం పనులను ప్రారంభిస్తామని తెలిపారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ అంబేద్కర్ సృతివనం నిర్మాణ పనులను జగన్ పరుగులు పెట్టించారని గుర్తుచేశారు

విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామన్నారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం విజయవాడ బందర్ రోడ్‌లో నిర్మిస్తున్న అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ లాంటి మహోన్నత వ్యక్తి జ్ఞాపకాలు ఎప్పటికీ గర్వకారణమన్నారు. ముళ్ల కంపలున్న ప్రాంతంలో అంబేద్కర్ కోసం 20 ఎకరాలు కేటాయించి చంద్రబాబు చేతులు దులుపుకున్నారని ఆయన దుయ్యబట్టారు. దళితుల ఆత్మగౌరవానికి అంబేద్కర్ ఎంతో స్పూర్తినిచ్చారని సజ్జల ప్రశంసించారు. చరిత్రలో నిలిచిపోయేలా అంబేద్కర్ స్మృతివనం సిద్ధమవుతోందని రామకృష్ణారెడ్డి అన్నారు. 

ALso Read: ఏపీలో పవర్ కట్స్ లేవు.. తెలంగాణలో మాత్రం కచ్చితంగా ఉన్నాయి..: సజ్జల కీలక వ్యాఖ్యలు

కోవిడ్ సంక్షోభ సమయంలోనూ అంబేద్కర్ సృతివనం నిర్మాణ పనులను జగన్ పరుగులు పెట్టించారని గుర్తుచేశారు. విజయవాడ నడిబొడ్డున , 20 ఎకరాల విలువైన భూములను అంబేద్కర్ స్మృతి వనం కోసం జగన్ కేటాయించి..రాష్ట్రానికి, దేశానికి కానుక ఇచ్చారని సజ్జల కొనియాడారు. ఇందులో అంతర్జాతీయ స్థాయి రీసెర్చ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని రామకృష్ణారెడ్డి తెలిపారు. నగరంలోని ఏ మూల నుంచి చూసినా అంబేద్కర్ స్మృతినం కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని సజ్జల వెల్లడించారు.