వాళ్ల తోలు తీస్తానని చంద్రబాబు బెదిరించారు: పార్థసారథి

YSRCP Leader Parthasarathi Fires on CM Chandrababu naidu
Highlights

వాళ్ల తోలు తీస్తానని చంద్రబాబు బెదిరించారు: పార్థసారథి

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ నేత పార్థసారథి.. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు కొన్ని రోజుల నుంచి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని.. సీఎం అతని కుమారుడు చేసిన అవినీతి పనులు శూలాల్లా గుచ్చుతున్నాయని.. ఆ నిస్తేజంతోనే బలహీనవర్గాలను కింఛపరుస్తున్నారని ఆరోపించారు.

నాలుగు రోజుల నుంచి ముఖ్యమంత్రి భయంతో ఉన్నారని.. కేంద్రం తీరుపై నిప్పులు చెరిగిన ఆయన.. నీతి ఆయోగ్‌లో చేతులు ఎత్తేశారని.. సమాధానం ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని ఢిల్లీలో ప్రెస్ మీట్ రద్దు చేసుకుని అమరావతికి వచ్చారని పార్థసారథి ఎద్దేవా చేశారు.. ఇన్నాళ్లు రెచ్చిపోయిన మంత్రులు కూడా ఇప్పుడు మౌనం పాటిస్తున్నారని దుయ్యబట్టారు.. గతంలో మత్స్యకారులు తమను ఎస్టీలుగా మార్చాలని  కోరితే.. తోలు తీస్తానని బెదిరించారని.. ఇప్పుడు నాయిబ్రాహ్మాణులను అవమానించారని విమర్శించారు. చంద్రబాబు తీరుతో బలహీన వర్గాలు రగిలిపోతున్నాయని పార్థసారథి అన్నారు.


 

loader