చంద్రబాబు వల్లే హోదా వెనక్కి, కేంద్రం అదే చెప్పింది: జగన్

Ysrcp chief Ys Jagan responds on Ap bandhu
Highlights

బంద్‌ను విఫలం చేసేందుకు ఏపీ చంద్రబాబునాయుడు చేయని కుట్ర లేదని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  విమర్శించారు. బాబు ఎన్నికుట్రలు చేసినా  ప్రజలు  బంద్‌ను విజయవంతం చేశారని చెప్పారు. ప్రజలు  బాబుకు  బుద్దిచెబుతారని ఆయన చెప్పారు. 
 


కాకినాడ: బంద్‌ను విఫలం చేసేందుకు ఏపీ చంద్రబాబునాయుడు చేయని కుట్ర లేదని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  విమర్శించారు. బాబు ఎన్నికుట్రలు చేసినా  ప్రజలు  బంద్‌ను విజయవంతం చేశారని చెప్పారు. ప్రజలు  బాబుకు  బుద్దిచెబుతారని ఆయన చెప్పారు. 

మంగళవారం సాయంత్రం ఏపీ బంద్‌పై  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మందిని వైసీపీ నేతలను అరెస్ట్ చేశారని చెప్పారు. ప్రజలు స్వచ్ఛంధంగా బంద్‌లో పాల్గొన్నారని జగన్ చెప్పారు.ఎన్ని అడ్డంకులు  సృష్టించినా బంద్‌ను విజయవంతం చేసిన ప్రజలకు వైసీపీ చీఫ్ జగన్  ధన్యవాదాలు తెలిపారు.బంద్‌ను నీరుగార్చేందుకు ఆర్టీసీ బస్సులను తిప్పేందుకు బాబును  ప్రయత్నించారన్నారు.


టీడీపీ ఎంపీలతో రాజీనామాలను చేయించి బంద్ లో పాల్గొనాల్సిన పరిస్థితుల్లో కూడ బంద్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం సరైందా అని ఆయన ప్రశ్నించారు. బంద్‌లో పాల్గొన్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడని చెప్పారు. దుర్గా ప్రసాద్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

బంద్‌లో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు, నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హమీలను బాబు విస్మరించాడని చెప్పారు,ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే  ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదని ఆయన అభిప్రాయపడ్డారు. 

భావితరాలు చంద్రబాబునాయుడును చరిత్రహీనుడుగా చూస్తారని చెప్పారు.  చంద్రబాబునాయుడు వల్లే ప్రత్యేక హోదా ఇవ్వలేదని కేంద్రం ప్రకటించిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు. 

అవిశ్వాసం సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్  వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. 

హోదా కోసం ఏ పార్టీ పోరాటం తాను సంపూర్ణంగా మద్దతును ఇస్తానని ఆయన ప్రకటించారు. చంద్రబాబునాయుడు చెబుతున్న అబద్దాలు తారాస్థాయికి చేరుకొన్నాయన్నారు. బాబు చేసే పనిలో స్వార్థం కన్పిస్తోందన్నారు. బీజేపీకి, కేంద్రానికి వ్యతిరేకంగా మొదటి నుండి మాట్లాడుతుంది తామేనని ఆయన గుర్తు చేశారు. బాబుకు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయని వైఎస్ జగన్ చెప్పారు.

చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే  ప్రత్యేక హోదా విషయమై జరిగే పోరాటంలో తమతో కలిసి రావాలని జగన్  సూచించారు. చేయాల్సిన పనులను సరైన సమయంలో చంద్రబాబునాయుడు చేయకపోవడం వల్లే ప్రత్యేక హోదా రాలేదన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో ఎవరున్నా లెక్కచేయకుండా పోరాటం చేసింది వైసీపీ మాత్రమేనని జగన్ గుర్తుచేశారు. ఎన్నికల ముందు హోదా సంజీవిని అంటారు. ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా కాదన్నారు.ప్రత్యేక హోదా సంజీవినా అంటూ ప్రశ్నిస్తారు... లేని ప్రత్యేక ప్యాకేజీకి అసెంబ్లీ లో ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేస్తారని చెప్పారు.

బీజేపీతో తెగదెంపులు చేసుకొన్నామని చెబుతూనే ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో రహస్యంగా సంబంధాలను కొనసాగిస్తున్నారని జగన్ విమర్శించారు. 4 ఏళ్లు బీజేపీతో సంసారం చేసి ఎన్నికలకు ముందు విడాకులు తీసుకొన్నారని బాబుపై జగన్ విమర్శలు గు.ప్పించారు. ప్రత్యేక హోదాకు బాబు దగ్గరుండి తూట్లు పొడిచారని విమర్శించారు.

బీజేపీని, కాంగ్రెస్ లను బాబు మేనేజ్ చేస్తారని జగన్ విమర్శించారు. చంద్రబాబునాయుడు ప్రతి అడుగులో స్వార్థం కన్పిస్తోందని జగన్ చెప్పారు. ప్రత్యేక హోదాను నాలుగేళ్లుగా తమ పార్టీ సజీవంగా ఉంచిందని జగన్ గుర్తుచేశారు. బాబు ఢిల్లీలో దీక్షకు దిగితే కేంద్రం దిగొచ్చేది కాదా అని జగన్ ప్రశ్నించారు. 


 

 

loader