Asianet News TeluguAsianet News Telugu

"హోదా" కోసం జగన్ "జై ఆంధ్రప్రదేశ్" ఉద్యమం

  • ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి "జై ఆంధ్రప్రదేశ్ " ఉద్యమం
  • నవంబర్ ఆరున విశాఖలో తొలి బహిరంగ సభ
  • రాష్ట్రమంతా తొలివిడతలో అయిదు సభలు
YSRC to launch Jai Andhra Pradesh movement

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను తిరస్కరించి కేంద్రం దానిని ప్యాకేజీకి కుదించిన తర్వాత,  ప్రత్యేక హోదా ఉద్యమం ఉదృతం చేసేందుకు ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ ’జై ఆంధ్రప్రదేశ్ ’ ఉద్యమం చేపట్టబోతున్నది.

 

’జై ఆంధ్రప్రదేశ్ ’ మొట్టమొదటి బహిరంగ సభని నవంబర్ ఆరోతేదీన విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని  మునిసిపల్ ఆడిటోరియంలో నిర్వహించాలని  పార్టీ నిర్ణయించింది. ఈ ఉద్యమానికి సంబంధించిన పోస్టర్ ను ఈ రోజు పార్టీ సీనియర్ నాయకులు హైదరాబాద్ లో విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్నిజిల్లా కేంద్రాలో జై ఆంధ్ర ప్రదేశ్ బహిరంగ సభలు నిర్వంచాలని పార్టీ నిర్ణయించింది మొదటి విడతల  మూడు ప్రాంతాలు, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలలో అయిదు చోట్ల  ఈ సభలు  జరుగుతాయి.

 

1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమ తరహాలో ప్రజలను జై ఆంధ్రప్రదేశ్ ఉద్యమానికి సమాయత్తంచేసే ఉద్దేశంతోనే ఈ  ప్రచారానికి ’జై ఆంధ్రప్రదేశ్’అని పేరు పెట్టినట్లు సీనియర్ నాయకుడొకరు చెప్పారు. ’కాకపోతే, ఆ నాటి ఉద్యమం ప్రత్యేకాంధ్ర రాష్ట్ర కోసం సాగింది. ఇప్పుడిది ప్రత్యేక హోదా కోసం. అంతే తేడా,’ అని ఆయన చెప్పారు.

 

కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ బోగస్  అని విమర్శిస్తూ, ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న పోరాటం ఆగదని ఈ సమావేవంలో ప్రసగించిన సీనియర్ నాయకులు చెప్పారు. టీడీపీ సర్కార్ దగాను ఎండగట్టేందుకే బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.

 

పోస్టర్ విడుదల కార్యక్రమంలో  పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వానికి సర్కార్ ప్రచార ఆర్భాటం సృష్టించడం తప్ప మరొక కార్యక్రమం లేకుండా పోయిందని విమర్శించారు.

 

 రాష్ట్రంలో మొత్తం అయిదుచోట్ల బహిరంగ సభలు నిర్వహించి, ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరిస్తామని ఉమ్మారెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా విషఫయంలో ప్రజాభిప్రాయం ఎలాఉందో ప్రభుత్వానికి దిమ్మదిరిగేలా వినిపిస్తామని ఆయన చెప్పారు.  ఈ కార్యక్రమంలో ఎంపీ విజయ సాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, వాసిరెడ్డి పద్మ, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.

 

ఇప్పటికే పార్టీ అధినేత,ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువభేరీ పేరుతో విద్యార్థులను, యువకులను ప్రత్యేక హోదా కోసం సమీకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాపితంగా ఆయన ’యువభేరీ’ మోగిస్తూనే ఉన్నారు. మంగళవారం నాడు కర్నూలులో ప్రత్యేక హోదా ’యువభేరీ’ సదస్సు జరుగుతూ ఉంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios