Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్ : నేడు డ్వాక్రా మహిళల అకౌంట్లలోకి నగదు.. ఎంత పడుతుందంటే..

2019 ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళల పేరుతో బ్యాంకుల్లో రూ. 25,570 80 కోట్ల అప్పు ఉంది. వైయస్సార్ ఆసరా ఉత్సవాలను జనవరి నెల చివరి వరకు ప్రభుత్వం నిర్వహించనుంది.

YSR Asara Scheme : How much money will be deposited into Dwakra women's accounts today? - bsb
Author
First Published Jan 23, 2024, 8:31 AM IST

అమరావతి : వైయస్సార్ ఆసరా పథకం నిధుల విడుదలకు జగన్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. దీని కింద ఆంధ్రప్రదేశ్ లోని డ్వాక్రా మహిళలకు మంగళవారం నాడు నాలుగో విడత నిధులు విడుదల చేయనున్నారు. మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో  వైయస్ జగన్ చేతుల మీదుగా వైయస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్థాయి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి వైయస్ జగన్ డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేస్తారు.

మంగళవారం ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్ ఆసరా పథకం నిధులు విడుదలవుతాయి. ఇప్పటివరకు దాదాపుగా నాలుగు విడతల్లో రూ.19,175.97 కోట్ల డ్వాక్రా మహిళలకు ఆసరా పథకం కింద చెల్లించారు. మిగిలిన రూ. 6394.83 కోట్లను నేడు జమ చేయనున్నారు.  78 లక్షల మంది ఖాతాల్లోకి ఈ నగదు వెళుతుంది. 2019 ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళల పేరుతో బ్యాంకుల్లో రూ. 25,570 80 కోట్ల అప్పు ఉంది. వైయస్సార్ ఆసరా ఉత్సవాలను జనవరి నెల చివరి వరకు ప్రభుత్వం నిర్వహించనుంది.

Ayodhya Ram Mandir: సీఎం జగన్ కు ఆహ్వానం అందలేదా? అందినా వెళ్ళలేదా?

మంగళవారం నాడు ఉరవకొండలో జరిగే కార్యక్రమంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తారు. దీంతో డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం తాడేపల్లి నివాసం నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్ బయలుదేరి ఉరవకొండకు చేరుకుంటారు. 

అక్కడి ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత వర్చువల్ గా డ్వాక్రా సంఘాల బ్యాంక్ అకౌంట్లోకి వైయస్సార్ ఆసరా నాలుగో విడత నగదు జమ చేస్తారు. ఈ సభ ముగిసిన తర్వాత తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios