Asianet News TeluguAsianet News Telugu

Ys Vivekananda Reddy Murder case: కొందరు బెదిరిస్తున్నారు... కోర్టులో వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటిషన్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను కొందరు బెదిరిస్తున్నారని పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో మంగళవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డిపై కూడా ఆయన కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Ys Vivekananda Reddy PA Krishna Reddy files petition against Cbi at Pulivendula Court
Author
Kadapa, First Published Dec 28, 2021, 4:21 PM IST

కడప: కొందరు తనను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి Ys Vivekananda Reddy వద్ద పీఏగా పనిచేసిన Krishna Reddy పులివెందులో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొందరి పేర్లను చెప్పాలని Cbi అధికారులు తనను ఒత్తిడి చేస్తున్నారని ఆ పిటిషన్‌లో కోరారు.

మంగళవారం నాడు Pulivendula కోర్టులో కృష్ణారెడ్డి తరపున లోకేశ్వర్ రెడ్డి అనే న్యాయవాది ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఇదే విషయమై Kadapa ఎస్పీకి కూడా ఈ నెల 13న కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే కడప ఎస్పీ నుండి స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్టుగా కృష్ణారెడ్డి తరపు న్యాయవాది లోకేశ్వర్ రెడ్డి చెప్పారు.

also read:YS Vivekananda Reddy Murder case: సునీతా రెడ్డిపై వివేకా పీఏ కృష్ణారెడ్డి ఎస్పీకి ఫిర్యాదు

వైఎస్ వివేకానందరెడ్డి కూతురు Ys Sunitha Reddy ఆమె భర్త రాజశేఖర్ రెడ్డితో పాటు శివప్రకాష్ రెడ్డి అనే మరో వ్యక్తి పై ఎస్పీకి  కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. వీరి వల్ల తనకు ప్రాణ హని ఉందన్నారు.  కృష్ణారెడ్డి గత 30 ఏళ్లుగా వివేకానంద రెడ్డి ఇంట్లో పనిచేస్తున్నాడు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పకు ఈ ఏడాది అక్టోబర్ 29న  గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఇదే తరహలో ఫిర్యాదు చేశారు. ఈ హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు చెప్పాలని సీబీఐ అధికారులు తనకు రూ. 10 కోట్లు ఆఫర్ చేశారని ఆయన ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

2019 మార్చి 14న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని దుండగులు హత్య చేశారు. అయితే ఈ హత్య కేసులో నలుగురిపై సీబీఐ అభియోగాలు మోపింది. సునీల్ యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిలపై సీబీఐ అభియోగాలను నమోదు చేసింది. అయితే ఈ కేసులో సీబీఐకి వివేకానందరెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి అప్రూవర్ గా మారాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు దారి తీసిన విషయాలను వివరించారు.

ఈ మేరకు  దస్తగిరి  ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు. ఈ కేసులో ఇంకా కొందరి పాత్ర గురించి సీబీఐ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. శివశంకర్ రెడ్డికి నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించాలని కూడా కోర్టులో సీబీఐ అధికారుల పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై కోర్టు శివశంకర్ రెడ్డి అభిప్రాయం కూడా కోరనుంది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు బెంగుళూరులో భూమి సెటిల్ మెంట్ కారణమని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో దస్తగిరి తెలిపారు. అయితే సీబీఐ ఈ కేసులో కీలక సాక్ష్యాలను సేకరించే పనిలో ఉంది. ఈ తరుణంలో  కొందరు ఎస్పీలకు ఫిర్యాదులు చేయడంతో పాటు కోర్టులను ఆశ్రయించడం ప్రస్తుతం చర్చకు దారితీసింది.

Follow Us:
Download App:
  • android
  • ios