వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను కొందరు బలవంతంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వివేకానందరెడ్డి వద్ద పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కడప ఎస్పీ అన్బురాజన్ కు సోమవారం నాడు ఈ మేరకు ఆయన నాలుగు పేజీల ఫిర్యాదును అందించారు.

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి తనకు ప్రాణ భయం ఉందని kadapa ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొందరు తనపై ఒత్తిడి తెస్తున్నారని ఎస్పీ anburajan కి ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు.పై విచారణ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.ys Vivekananda Reddyని 2019 మార్చి 14న రాత్రి ఇంట్లోనే దుండగలు దారుణంగా హత్య చేశారు.ఈ కేసులో ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ లపై Cbi అభియోగాలను మోపింది.

also read:నన్ను కావాలనే వైఎస్ వివేకా మర్డర్ కేసులో ఇరికిస్తున్నారు..: హైకోర్టులో గంగిరెడ్డి క్వాష్ పిటిషన్

గత మాసంలోనే దస్తగిరి వాంగ్మూలం మేరకు వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ అధికారులతో పాటు వైఎస్ వివేకానందరెడ్డి అనుచరులు తమను బెదిరిస్తున్నారని ఒక్కొక్కరుగా ఎస్పీలకు ఫిర్యాదులు చేస్తుండడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. వైఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న కృష్ణారెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చకు కారణమైంది.వైఎస్ వివేకానందరెడ్డి కూతురు Ys Sunitha Reddy ఆమె భర్త రాజశేఖర్ రెడ్డితో పాటు శివప్రకాష్ రెడ్డి అనే మరో వ్యక్తి పేరును కూడా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో కృష్ణారెడ్డి పేర్కొన్నారు. వీరి వల్ల తనకు ప్రాణ హని ఉందన్నారు. కృష్ణారెడ్డి గత 30 ఏళ్లుగా వివేకానంద రెడ్డి ఇంట్లో పనిచేస్తున్నాడు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పకు గత మాసంలోత గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఇదే తరహలో ఈ ఏడాది నవంబర్ 29న ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి పేర్లను చెప్పాలని సీబీఐ రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందని ఆయన ఆరోపించారు. అంతేకాదు ఈ విషయమై తనను చిత్రహింసలు పెట్టారన్నారు తనకు ప్రాణ రక్షణ కల్పించాలని కూడా కోరారు. Gangadhar Reddy ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనకు రక్షణ కల్పించారు.వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు బెంగుళూరులో భూమి సెటిల్ మెంట్ కారణమని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో దస్తగిరి తెలిపారు. అయితే సీబీఐ ఈ కేసులో కీలక సాక్ష్యాలను సేకరించే పనిలో ఉంది. అయితే ఈ తరుణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా ఎస్పీలకు ఫిర్యాదులు చేస్తూ రక్షణ కోరడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. అంతేకాదు ఎస్పీలకు ఫిర్యాదు చేసిన వారంతా కూడా వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డిపై ఫిర్యాదులు చేయడం గమనార్హం.ఇదిలా ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి కూడా తనను ఈ కేసులో బలవంతంగా ఇరికించే ప్రయత్నం జరుగుతుందని ఏపీ హైకోర్టులో ఈ నెల 2న క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గంగిరెడ్డి జైలు నుండి విడుదలయ్యారు.