Asianet News TeluguAsianet News Telugu

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు: సీబీఐ సంచలన నిర్ణయం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఈ కేసు విచారణ బాధ్యతను ఢిల్లీ ప్రత్యేక నేరాల విభాగానికి చెందిన 3వ బ్రాంచీకి అప్పగించారు.
 

YS Viveka's murder: CBI files FIR under IPC 302, Delhi special crime branch to probe the case lns
Author
Kadapa, First Published Oct 15, 2020, 12:01 PM IST

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఈ కేసు విచారణ బాధ్యతను ఢిల్లీ ప్రత్యేక నేరాల విభాగానికి చెందిన 3వ బ్రాంచీకి అప్పగించారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసు విచారణ అధికారిగా డీఎస్పీ దీపక్ గౌర్ ను నియమించింది. ఐపీసీ 302 ప్రకారంగా సీబీఐ కేసును రీ రిజిస్ట్రేషన్ చేసింది.

ఈ కేసు విచారణ కోసం కొత్త సీబీఐ బృందం కడపకు రానుంది.ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

also read:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య: మరో ముగ్గురిని విచారించిన సీబీఐ

తొలుత వివేకా హత్య కేసును సీఆర్‌పీసీ 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సీబీఐ మార్పులు చేసింది. కరోనా ప్రభావంతో కొద్ది రోజులుగా కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. త్వరలోనే  స్పెషల్ టీమ్ దర్యాప్తును ప్రారంభించనుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios