Asianet News TeluguAsianet News Telugu

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య: మరో ముగ్గురిని విచారించిన సీబీఐ

 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణలో మరింత వేగాన్ని పెంచింది. ఆర్ధిక లావాదేవీల కోణంలో ఈ హత్య ఏమైనా చోటు చేసుకొందా అనే కోణంలో కూడ సీబీఐ విచారణ సాగిస్తోంది.

ys viveka murder case:three attend infront of CBI probe in Kadapa lns
Author
Kadapa, First Published Sep 27, 2020, 4:55 PM IST


కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణలో మరింత వేగాన్ని పెంచింది. ఆర్ధిక లావాదేవీల కోణంలో ఈ హత్య ఏమైనా చోటు చేసుకొందా అనే కోణంలో కూడ సీబీఐ విచారణ సాగిస్తోంది.

2019 మార్చి 15వ తేదీన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోనే హత్య చేశారు. ఈ హత్య కు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు గాను సీబీఐ పలు కోణాల్లో విచారిస్తుంది.

also read:వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు: చెప్పుల షాపు యజమానిని రెండో రోజు విచారణ

కడపలోని గెస్ట్ హౌస్ లో సీబీఐ అధికారులు మకాం వేశారు.  ఈ కేసులో అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. కడపకు చెందిన చెప్పుల వ్యాపారిని సీబీఐ అధికారులు ఐదు రోజుల పాటు  విచారించారు. చెప్పుల దుకాణం డీలర్లను ఇవాళ సీబీఐ అధికారులు విచారించారు.చెప్పుల వ్యాపారిని విచారించిన తర్వాత చెప్పుల డీలర్లను  ఇవాళ సీబీఐ అధికారులు విచారణకు పిలిపించారు. 

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసు సీబీఐతో విచారణ చేయించాలని వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్ర, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల మేరకు ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios