ఈ 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు YS రాజారెడ్డికి, ప్రియమైన అట్లూరి ప్రియాతో జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక , ఫిబ్రవరి 17న 2024 వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది.
అమరావతి : వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలతో పాటు ఓ గుడ్ న్యూస్ కూడా పంచుకున్నారు. ఈ ఫిబ్రవరిలో తన కొడుకు రాజారెడ్డి పెళ్లి చేయబోతున్నట్లు తెలిపారు. జనవరి 18న నిశ్చితార్థం వేడుక ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కొడుకు, కాబోయే కోడలు ఫొటోలను షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. అందులో..
‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు YS రాజారెడ్డికి, ప్రియమైన అట్లూరి ప్రియాతో జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక , ఫిబ్రవరి 17న 2024 వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది.
చెల్లి షర్మిలకు జగనన్న రాయబారం... కాంగ్రెస్ హ్యాండిచ్చేనా?
రేపు మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి, నాన్న ఆశీస్సులు తీసుకుంటామని చెప్పడానికి సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో ఈ వారం చేరబోతుందని సమాచారం. వైఎస్ షర్మిల వెంట నడిచేందుకు వైసీపీ నుంచి బైటికి వచ్చిన సీనియర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
