Asianet News TeluguAsianet News Telugu

మామిళ్లపల్లి పేలుడు కేసు: జగన్ కుటుంబంలో అరెస్ట్ కలకలం.. పోలీసుల అదుపులో వైఎస్ ప్రతాపరెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కడప జిల్లా మామిళ్లపల్లె ముగ్గురాళ్ల గనుల్లో పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు కీలక వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కుటుంబానికి చెందిన వైఎస్ ప్రతాప్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. 

ys pratap reddy arrested in mamillapalle blast case ksp
Author
Kadapa, First Published May 11, 2021, 6:44 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కడప జిల్లా మామిళ్లపల్లె ముగ్గురాళ్ల గనుల్లో పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు కీలక వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కుటుంబానికి చెందిన వైఎస్ ప్రతాప్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.

అనంతరం మంగళవారం కోర్టులో హాజరుపరిచినట్లు కడప జిల్లా ఎస్పీ తెలిపారు. గనిలో వినియోగించే జిలెటన్‌ స్టిక్స్‌ పులివెందుల నుంచి కలసపాడు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో పులివెందులలో వైఎస్‌ ప్రతాప్‌రెడ్డికి చెందిన మ్యాగజైన్‌ లైసెన్స్‌ నుంచి జిలెటన్‌ స్టిక్స్‌ తరలించినట్లు తేలింది. ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టకుండా వీటిని తరలించారంటూ ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

Also Read:మామిళ్లపల్లె క్వారీ పేలుడు: ఐదు శాఖలతో కమిటీ, ఐదు రోజుల్లో నివేదికకు ప్రభుత్వం ఆదేశం

వైఎస్ ప్రతాప్‌రెడ్డి... కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి పెదనాన్న. ఆయనకు పులివెందుల, సింహాద్రిపురం, లింగాల పరిసర ప్రాంతాల్లో గనులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేలుడుకు వినియోగించే జిలెటన్‌ స్టిక్స్‌కు మ్యాగజైన్‌ లైసెన్స్‌ ప్రతాప్‌రెడ్డికి ఉంది.

దీనిలో భాగంగా ఘటన జరిగిన రోజున పులివెందుల నుంచి మామిళ్లపల్లె గనులకు జిలెటన్‌ స్టిక్స్‌ తరలించి అక్కడ అన్‌లోడ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ కేసులో ఇప్పటికే గని యజమాని నాగేశ్వర్‌రెడ్డితో పాటు మరొకరిని అరెస్ట్‌ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios