కడప: కడప జిల్లా మామిళ్లపల్లె క్వారీలో  పేలుడు ఘటనపై  ఐదు ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఐదు రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కడప జిల్లా మామిళ్లపల్లెలోని క్వారీలో పేలుడు ఘటనలో తొమ్మిది మంది మరణించారు. ఈ విషయమై ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. ఈ ఘటనకు కారణాలను లోతుగా దర్యాప్తు చేసేందుకు గాను  ఐదు ప్రభుత్వ శాఖలతో కమిటీని ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారంనాడు ప్రకటించారు. 

also read:క్వారీ ప్రమాదం: పవన్ దిగ్బ్రాంతి.. బాధితులకు ప్రభుత్వోద్యోగం, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

క్వారీని లీజుకు తీసుకొన్న నిర్వాహకుడి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు. క్వారీని నిర్వహిస్తున్న యజమానిపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. సీఎం స్వంత జిల్లాలో భారీ ప్రమాదం జరగడంపై  రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనకు గల కారణాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.