Asianet News TeluguAsianet News Telugu

మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్

మంత్రులు అవినీతికి పాల్పడినట్టు తేలితే విచారణ జరిపించి వెంటనే కేబినెట్‌ నుండి తొలగిస్తానని సీఎం హెచ్చరించారని, ఏపీ మంత్రి పేర్నినాని ప్రకటించారు.రైతులందరికీ వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకొంది.

ys jagan warns to ministers in first cabinet meeting over corruption
Author
Amaravathi, First Published Jun 10, 2019, 6:23 PM IST

అమరావతి: మంత్రులు అవినీతికి పాల్పడినట్టు తేలితే విచారణ జరిపించి వెంటనే కేబినెట్‌ నుండి తొలగిస్తానని సీఎం హెచ్చరించారని, ఏపీ మంత్రి పేర్నినాని ప్రకటించారు.రైతులందరికీ వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకొంది.

ఏపీ మంత్రి పేర్నినాని కేబినెట్‌లో తీసుకొన్న నిర్ణయాలను సోమవారం నాడు సాయంత్రం మీడియాకు వివరించారు.పారదర్శకంగా పాలన సాగించాలనే ఉద్దేశ్యంతో అవినీతికి దూరంగా ఉండాలని  జగన్ మంత్రివర్గ సహచరులకు సూచించారని ఆయన గుర్తు చేశారు.  

ఈ కేబినెట్ దేశానికి ఆదర్శంగా ఉండాలని సీఎం తమకు సూచించారన్నారు. గత ప్రభుత్వంలో చోటు చేసుకొన్న అవినీతిని వెలికితీయాలని అధికారులకు,మంత్రులకు సీఎం సూచించారని చెప్పారు.

ఏపీ రాష్ట్ర రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతులకు వడ్డీ లేని రుణాలను  అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకొందన్నారు.  50 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి కింద రూ. 12,500 చెల్లించనున్నట్టు  మంత్రి తెలిపారు. 

రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక్కొక్క రిగ్గును అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకొన్నారు.  రైతులకు ఉచితంగా బోర్లను వేయించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకొన్నారు. తొలుత తమ పేర్లను నమోదు చేసుకొన్న రైతులకు బోర్లను వేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు మంత్రి నాని తెలిపారు. 

జ్యూడీషీయల్ కమిషన్ ఏర్పాటు కోసం  ప్రభుత్వం  చర్యలు తీసుకొంటుందని ఆయన చెప్పారు. జ్యూడిషీయల్ కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్టు మంత్రి తెలిపారు. జ్యూడిషీయల్ కమిషన్ ఇచ్చిన సూచనలను టెండర్ల విషయంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా మంత్రి తెలిపారు.

ఆగష్టు 15వ తేదీ నాటికి గ్రామ వలంటీర్ల నియామకం పూర్తి చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన చెప్పారు.  ఉగాది నుండి అర్హులైన వారికి మహిళల పేరుతో ఇళ్ల పట్టాలను  అందించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకొన్నట్టుగా మంత్రి చెప్పారు. ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లను కూడ నిర్మించాలని ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకొన్నారు.

ఈ ఏడాది జూలై 1వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. మరో వైపు సీపీఎస్ రద్దు కోసం ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు ఆర్థికశాఖమంత్రి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్‌లో తీర్మానం చేసినట్టుగా ఆయన తెలిపారు. 

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నట్టుగా  మంత్రి నాని తెలిపారు.

 

సంబంధిత వార్తలు

అధికారులు, మంత్రులకు జగన్ బంపర్ ఆఫర్

సుదీర్ఘంగా సాగిన జగన్ తొలి కేబినెట్ భేటీ: కీలక నిర్ణయాలకు ఆమోదం

Follow Us:
Download App:
  • android
  • ios