Asianet News TeluguAsianet News Telugu

సుదీర్ఘంగా సాగిన జగన్ తొలి కేబినెట్ భేటీ: కీలక నిర్ణయాలకు ఆమోదం

ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని తొలి కేబినెట్ భేటీ ఆరు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది.

ap cabinet takes key decisions
Author
Amaravathi, First Published Jun 10, 2019, 4:34 PM IST


అమరావతి:  ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని తొలి కేబినెట్ భేటీ ఆరు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది.

ఏపీ  మంత్రివర్గ సమావేశం సోమవారం నాడు అమరావతిలో జరిగింది.  ఈ సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చించారు.ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన  తర్వాత అదే వేదికపై సామాజిక పెన్షన్లను  రూ.2250కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకొంది. ఆశా వర్కర్ల వేతనాలను రూ. 10వేలకు పెంచింది. ఇప్పటికే ఈ విషయమై వైఎస్ జగన్  హామీ ఇచ్చారు.ఈ  హామీని కేబినెట్ ర్యాటిఫికేషన్ చేసింది.

ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ కమిటీ మూడు మాసాల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. 

కేబినెట్‌ ఎజెండా కేవలం 8 అంశాలే ఉన్నాయి. కానీ టేబుల్ ఎజెండాగా 15 అంశాలు చర్చించారని సమాచారం. కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల వేతనాలను రూ. 400 నుండి రూ. 4 వేలకు పెంచుతూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం వల్ల సుమారు 7265 లబ్ది పొందనుంది. సీపీఎస్ రద్దు విషయమై ఏపీ కేబినెట్ సానుకూలంగా స్పందించింది.

పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కేబినెట్‌లో చర్చించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios