పోలీసులకు జగన్ వార్నింగ్

Ys jagan warned police in prajasankalpayatra
Highlights

  • వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. కర్నూలు జిల్లా హుసేనాపురంలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన మహిళా సదస్సులో పాల్గొన్న జగన్ పోలీసులను ఉద్దేశించి తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికీ చంద్రబాబు పాలన మాత్రమే ఉండదనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. సదస్సుకు వస్తున్న మహిళలను అడ్డుకోవడం ఏంటని పోలీసులపై మండిపడ్డారు. పోలీసులు చట్టప్రకారం చేయాల్సిన డ్యూటీ మాత్రమే చేయాలని సూచించారు. ప్రభుత్వం కోసం, టోపీ మీదున్న మూడు సింహాల కోసం మాత్రమే పని చేయాలని సలహా ఇచ్చారు. అంతేకాని, మూడు సింహాల వెనకున్న గుంట నక్కలకు సెల్యూట్ కొట్టేందుకు మీరు పని చేయడం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. జగన్ సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న మహిళలను జిల్లా వ్యాప్తంగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో జగన్ పోలీసులపై ఫైర్ అయ్యారు.

loader