మొండోడు, జగన్ కులానికే మానవత్వమా: పవన్
జగన్ వందలాది రోజులు జైల్లో ఉండి వచ్చారని ఆయన మెుండిగా పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అయ్యారని తాను కాలేనా అన్నారు. తనకు కూడా మెుండితనం ఎక్కువ అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. జగన్ ను తాను ఏనాడు ముఖ్యమంత్రిగా అంగీకరించబోనని తెలిపారు.
తన మతం మానవత్వం, ఇచ్చిన మాట తప్పకపోవడం తన కులం అంటూ సీఎం జగన్ రెడ్డి అనడం చూస్తుంటే మిగిలిన కులాల వారికి మానవత్వం లేదా అంటూ నిలదీశారు. ఆర్నెళ్ల జగన్ పాలనలో చేసింది ఏమీ లేదని తిట్టిపోశారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. జగన్ గానీ ఆయన కేబినెట్లో ఉన్న మంత్రులు గానీ వాడే భాష అసభ్యకరంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీవీలు చూస్తున్నా, ఏదైనా డిబేట్ చూద్దామని టీవీపెడితే వైసీపీ మంత్రుల బూతులే వినిపిస్తున్నాయన్నారు. అమ్మ, ఆలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తారా ఇదేనా మీ సంస్కారం అంటూ విరుచుకుపడ్డారు.
జగన్! చేతకాకపోతే గద్దె దిగు, ఎన్నికల్లో తేల్చుకుందాం: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
టీవీ చర్చల్లోనూ, ఇతర విషయాల్లోనూ ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడుతుంటే ఇలా అత్యాచారాలు, దారుణాలు జరగకుండా ఉంటాయా అంటూ నిలదీశారు. చట్టసభల్లో చట్టాలు చేయాల్సిన స్థానాల్లో ఉన్న మంత్రులు బూతులు తిడితే ఇలాంటి దారుణాలు జరుగుతాయన్నారు.
మంత్రులు ఇకనైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మంత్రులు వాడే భాష సమాజం అంగీకరించేలా ఉండాలని కోరారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇకపోతే జగన్ వందలాది రోజులు జైల్లో ఉండి వచ్చారని ఆయన మెుండిగా పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అయ్యారని తాను కాలేనా అన్నారు. తనకు కూడా మెుండితనం ఎక్కువ అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.
దెబ్బలు తింటాను, తల ఎగిరిపోయినా పర్వాలేదు: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు