కర్నూలు: ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులను మంగళవారం నాడు కర్నూల్ లో కలుసుకున్నారు. తమకు న్యాయం చేయాలని సీఎంకు ప్రీతి కుటుంబసభ్యులు విజ్ఞప్తిచేశారు. 

కర్నూలులో కంటివెలుగు మూడోదశ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించిన తర్వాత సుగాలి ప్రీతి తల్లి పార్వతి సహా కుటుంబ సభ్యులు సీఎంను కలుసుకున్నారు.

 ఈకేసును సీబీఐకి రిఫర్‌ చేస్తున్నామని సీఎం వారికి స్పష్టంచేశారు. తప్పక న్యాయం జరుగుతుందని వారికి భరోసానిచ్చారు. అంతేకాక  ప్రీతి కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. 

Also read:నా బిడ్డకు న్యాయం చేయండి: జగన్‌ను కలిసిన సుగాలి ప్రీతి తల్లి

అంతేకాదు బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని కూడ స్పష్టం చేశారు.  ఈవిషయమై మరోసారి కూలంకషంగా మాట్లాడుతానని తన వద్దకు రావాలని వారికి సూచించారు. ప్రీతి కుటుంబాన్ని తన వద్దకు మరోసారి తీసుకురావాలంటూ అక్కడే ఉన్న తన కార్యాలయ అధికారులను సీఎం ఆదేశించారు.