పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర బంద్ లో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ బంద్ లో పాల్గొనేందుకు పాదయాత్రకు విరామం ఇచ్చారు. జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్ పేట మండ‌లం దుండిగం క్రాస్ జోగుల‌గుంట‌ప‌ల్లి శివారులో జ‌గ‌న్ బంద్ లో పాల్గొన్నారు. నేతలు, శ్రేణులతో కలిసి జగన్ ప్లకార్డులు చేతిలో పట్టుకుని రోడ్లపై తిరిగారు. పార్టీ పెట్టిన దగ్గర నుండి వైసిపి పలుమార్లు బంద్ పిలుపిచ్చినా  ఈ స్ధాయిలో జగన్ స్వయంగా పాల్గొనటం మాత్రం ఇదే మొదటిసారి. ‘ప్రత్యేకహోదానే ఏపికి సంజీవని’ అనే ప్లకార్డును ప్రదర్శిస్తూ జగన్ నేతలు, శ్రేణులను ఉత్సాహపరిచారు.