అమరావతి: కలెక్టర్లు వారంలో ఏదో ఒక గ్రామంలో బస చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ సూచించారు.సోమవారం నాడు అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. ఏ గ్రామంలో తాము బస చేస్తున్నామో కలెక్టర్లు మాత్రం స్థానికంగా అధికారులకు సమాచారం ఇవ్వకూడదన్నారు.

 తాము నిద్రించేందుకు అవసరమైన పడకను కూడ కలెక్టర్లు తీసుకెళ్లాలని  జగన్  సూచించారు.ఆసుపత్రులు,  స్కూళ్లలో కలెక్టర్లు బస చేయాలని ఆయన  కోరారు. ప్రతి స్కూల్ ఫోటోను తనకు పంపాలని  ఆయన కోరారు. 

వచ్చే ఉగాది నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్లు లేని పేదలు ఉండకూడదని సీఎం  కలెక్టర్లను కోరారు. పేపర్లపైనే పట్టాలు ఉండకూడదన్నారు. ఉగాది రోజున  పట్టాలను పంపిణీ కార్యక్రమాన్ని  పండగ వాతావరణంలో నిర్వహించాలని ఆయన సూచించారు. 

ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కోసంప్రభుత్వం నిధులను మంజూరు చేస్తోందని  ఆయన చెప్పారు. రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా  ప్రభుత్వ పథకాల పనితీరును పరిశీలించనున్నట్టు జగన్ ప్రకటించారు.

ఆ గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని  సీఎం ఆదేశించారు. ప్రతి నెల మూడో గురువారం నాడు ఔట్ సోర్సింగ్  ఉద్యోగుల సమస్యలను వినేందుకు సమయం కేటాయించాలని జగన్ కోరారు. ప్రజల సమస్యలను వినేందుకు ఒక్క రోజు సమయాన్ని కేటాయించాలని ఆయన అధికారులను ఆదేశించారు.ప్రతి సోమవారం నాడు గ్రీవెన్స్ డే నిర్వహించాలని ఆయన ఆదేశించారు.  సోమవారం నాడు  ఎలాంటి సమీక్షలు నిర్వహించకూడదని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.

 

సంబంధిత వార్తలు

ఎల్లుండి ప్రజా వేదిక భవనం కూల్చివేత: సీఎం జగన్ ఆదేశం

ప్రభుత్వ పనితీరుపైనే ప్రజలు ఓటు చేస్తారు: వైఎస్ జగన్

ఎంతటి వాడైనా అవినీతికి పాల్పడితే సహించం: జగన్ కీలక వ్యాఖ్యలు
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి: జగన్