అమరావతి:ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని  ఏపీ సీఎం వైఎస్ జగన్ కలెక్టర్లను కోరారు. పాలకులం కాదు... ప్రజలకు సేవకులం అనే విషయాన్ని గుర్తుంచుకొని పాలనను సాగించాలని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు.

రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సమావేశాన్ని సోమవారం నాడు అమరావతిలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ ఉద్దేశాలను ఆయన కలెక్టర్లకు వివరించారు. 

నవరత్నాలకు సంబంధించిన బ్రోచర్‌ను సీఎం ఈ సమావేశంలో చూపించి  ప్రతి మంత్రితో పాటు హెచ్ఓడీతో పాటు ప్రతి ఒక్కరి వద్ద ఉండాలని ఆయన చెప్పారు.మేనిఫెస్టో‌ను బైబిల్, ఖురాన్, బైబిల్ గా భావించి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.