Asianet News TeluguAsianet News Telugu

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం: హైకోర్టు తీర్పుపై సుప్రీంకు జగన్ ప్రభుత్వం

విజయవాడ కోవిట్ కేర్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

YS Jagan govt file petition on high court order on Swarna palace fire accident
Author
New Delhi, First Published Sep 3, 2020, 4:23 PM IST

న్యూఢిల్లీ: విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎక్కింది. ఆ ప్రమాదంపై దర్యాప్తును తాత్కాలికంగా ఆపేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 

స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ కేర్ సెంటర్ ను నిర్వహించిన రమేష్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ పి. రమేష్ బాబు, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సీతా రామ్మోహన్ రావులపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను అన్నింటినీ నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి డి. రమేష్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Also Read: చంద్రబాబు మాటలు వింటే పవన్, ఎన్టీఆర్‌ల గతే: హీరో రామ్‌కు కొడాలి నాని హితవు

అగ్నిప్రమాదం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇదే హోటల్లో అంతకు ముందు ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాన్ని నిర్వహించిన నేథ్యంలో స్వర్ణ ప్యాలెస్ సురక్షితం కాదని తెలిసినప్పుడు అక్కడ క్వారంటైన్ కేంద్రం ఏర్పాటుకు సబ్ కలెక్టర్ ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. 

ప్రమాద ఘటనపై కృష్ణా జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎంహెచ్వోలను నిందితులుగా ఎందుకు చేర్చలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనపై రమేష్ ఆస్పత్రి ఎండీ రమేష్ బాబు, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సీతా రామ్మోహన్ రావులపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ జస్టిస్ డి. రమేష్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.

Also Read: స్వర్ణ ప్యాలెస్ ఘటన: జగన్ సర్కార్ కు షాక్, డాక్టర్ రమేష్ కు భారీ ఊరట

Follow Us:
Download App:
  • android
  • ios