మారిషస్ కంపెనీ కేసుతో జగన్ పిచ్చ హ్యాపీ..ఎందుకో తెలుసా ?

Ys jagan full happy over Mauritius company case in arbitration court
Highlights

  • వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు నేతలు కూడా ఫుల్లు ఖుషీగా ఉన్నారు.

వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు నేతలు కూడా ఫుల్లు ఖుషీగా ఉన్నారు. జగన్ అంత ఫుల్లు ఖుషీ అయ్యేంత ఏం జరిగింది? అంటే జరిగింది. ఇందూ టెక్ పై ఓ మారిషస్ కంపెనీ అంతర్జాతీయ కోర్టులో కేసు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో పచ్చమీడియా జగన్ కి నెగిటివ్ గా ఓ రేంజిలో ప్రచారం మొదలుపెట్టింది. ఇపుడు ప్రచారమే జగన్ కు ప్లస్ గా మారింది.

ఎలాగంటే, జగన్ పై సిబిఐ, ఈడి నమోదు చేసిన కేసుల్లో ఇందూ టెక్ కేసు కూడా ఉన్నది. ఇందూ కంపెనీలో పెట్టుబడులు పెట్టినందుకే ఇపుడా కంపెనీ అంతర్జాతీయ కోర్టకెక్కింది. ఎప్పుడైతే మారిషస్ కోర్టు అంతర్జాతీయ కోర్టుకెక్కిందో సిబిఐ, ఈడి, పచ్చమీడియా గొంతులో వెలక్కాయపడింది.

ఎందుకంటే, ఒకపుడు సిబిఐ, ఈడి పెట్టిన కేసుల్లో సదరు మారిషస్ కంపెనీ ఓ డమ్మీ (షెల్) కంపెనీ అని. తన అక్రమసంపాదనను మారిషస్ లోని షెల్ కంపెనీలో పెట్టి మళ్ళీ ఇందూ కంపెనీలోకి తెచ్చారన్నది ప్రధాన అభియోగం. అయితే, ఇపుడా కంపెనీకి జగన్ కు ఏమాత్రం సంబంధం లేదని తేలిపోయింది.

ఆ కంపెనీ నిజంగానే జగన్ షెల్ కంపెనీ అయితే ఇపుడు కోర్టుకెందుకు ఎక్కుతుంది? అంటే సదరు కంపెనీ డమ్మీ కంపెనీ కాదని తేలిపోయింది. ఈ ఒక్క పాయింట్ మీదే జగన్ పై సిబిఐ, ఈడి నమోదు చేసిన కేసు వీగిపోయే అవకాశం ఉందని వైసిపి నేతలు పిచ్చ హ్యాపీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి కేసులు ఇంకెన్ని తెరపైకి వస్తాయో? ఎన్నికేసులు వీగిపోతాయో చూడాలి?

loader