యరపతినేనిపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి
అక్రమ మైనింగ్ వ్యవహరం గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు చుట్టుకొంది.ఈ విషయమై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతిచ్చింది.
గుంటూరు: గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత యరపతినేని శ్రీనివాస్ పై సీబీఐ విచారణకు సోమవారం నాడు హైకోర్టు అనుమతి ఇచ్చింది.అయితే సీబీఐ విచారణకు ఇవ్వాలో వద్దో అనే విషయమై తుది నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని హైకోర్టు స్పష్టం చేసింది.
సోమవారం నాడు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ విషయమై హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. యరపతినేని శ్రీినివాసరావు మైనింగ్ కేసులో సీఐడీ సోమవారం నాడు హైకోర్టుకు సమర్పించింది. సీఐడీ నివేదిక ఆధారంగా అక్రమ మైనింగ్ జరిగిందని తేలిందని హైకోర్టు అభిప్రాయపడింది.
యరపతినేని శ్రీనివాసరావుపై ఈడీ విచారణ చేయాల్సిన అవసరం కూడ ఉందని హైకోర్టు చెప్పింది. అంతేకాదు యరపతినేని శ్రీనివాసరావు బ్యాంకు లావాదేవీలపై కూడ అనేక అనుమానాలను హైకోర్టు వ్యక్తం చేసింది. మైనింగ్ విషయంలో సీఐడీ నివేదికను చూస్తే అక్రమాలు చోటు చేసుకొన్నాయని తేలిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ విషయంలో సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సీబీఐ విచారణ చేయించాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్టమని కూడ హైకోర్టు స్పష్టం చేసింది.హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తోందోననేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
సంబంధిత వార్తలు
అక్రమమైనింగ్ కేసులో టీడీపీ నేత యరపతినేనిపై కేసు