Asianet News TeluguAsianet News Telugu

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు కాలినడకన జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకునేందుకు అలపిరి చేరుకున్నారు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సామాన్య భక్తుడిలా కాలినడకన తిరుమలకు బయలు దేరారు. మెట్ల మార్గంలో కొబ్బరికాయ కొట్టిన ఆయన శ్రీవారిని దర్శించుకునేందుకు బయలు దేరారు. 
 

ys jagan begins walk tirumala
Author
Tirumala, First Published Jan 10, 2019, 2:24 PM IST

తిరుపతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకునేందుకు అలపిరి చేరుకున్నారు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సామాన్య భక్తుడిలా కాలినడకన తిరుమలకు బయలు దేరారు. మెట్ల మార్గంలో కొబ్బరికాయ కొట్టిన ఆయన శ్రీవారిని దర్శించుకునేందుకు బయలు దేరారు. 

సాయంత్రానికి కొండ మీదకు చేరుకుంటారు వైఎస్ జగన్. పలువురు వైసీపీ నేతలు సైతం శ్రీవారిని దర్శించుకునేందుకు జగన్ వెంట నడుస్తున్నారు. తన కాలినడక వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పార్టీ కార్యకర్తలకు జగన్ ఆదేశించారు. 

సాయంత్రం 5.30 గంటలకు స్వామి వారిని దర్శించుకున్న తర్వాత శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలవనున్నారు. అక్కడ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకోనున్నారు. 

అనంతరం సర్వదర్శనం ద్వారా స్వామివారిని వైఎస్‌ జగన్‌ దర్శించుకుంటారు. రాత్రి తిరుమలలో బసచేసి శుక్రవారం ఉదయం తిరుమల నుంచి బయలుదేరి కడప మీదుగా పులివెందులకు చేరుకుంటారు వైఎస్ జగన్. 

ఈ వార్తలు కూడా చదవండి

రేణిగుంట చేరుకున్న జగన్: ఘనస్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు

పాదయాత్ర తర్వాత శ్రీవారి సన్నిధికి వైఎస్ జగన్

Follow Us:
Download App:
  • android
  • ios