చంద్రబాబు'పెళ్లిళ్లపై' జగన్ వ్యాఖ్యలు: అమరావతి బాండ్లపై ఆరోపణ

First Published 20, Aug 2018, 6:51 PM IST
YS Jagan alleges Chandrababu received commissions in amaravati bonds: YS Jagan
Highlights

 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత జగన్ నిప్పులు చెరిగారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్టణం జిల్లా కోటరవుట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని సైతం అమలు చెయ్యలేదని దుయ్యబుట్టావరు. 

విశాఖపట్టణం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత జగన్ నిప్పులు చెరిగారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్టణం జిల్లా కోటరవుట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని సైతం అమలు చెయ్యలేదని దుయ్యబుట్టావరు. 

విశాఖపట్టణంలోని నక్కపల్లి, పాయకరావుపేట ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని....పురుడు పోసుకుందామంటే కనీసం గైనకాలజిస్ట్ కూడా ఉండని దౌర్భాగ్యపరిస్థితి అన్నారు. మత్స్యకారులకు మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏర్పాటు చేశారో చూపించాలని సవాల్ విసిరారు. 
 
చంద్రబాబు పాలనలో అంతా అన్యాయం జరుగుతుందే తప్ప న్యాయం ఎక్కడా లేదన్నారు. చంద్రబాబు పాలన నాటి బ్రిటీష్ పాలనను తలపిస్తుందని మండిపడ్డారు. విభజించి పాలించు అన్నరూల్ తో బ్రిటీష్ పాలన ఉంటే...కులాల మధ్య చిచ్చుతో చంద్రబాబు పాలన ఉందన్నారు. వాళ్లు మన సహజ సంపద తరలించుకుపోతే చంద్రబాబు నాయుడు ఇసుక నుంచి ప్రకృతి సిద్ధంగా లభించే ఏ వనరును మిగల్చడం లేదన్నారు. ఏపీలో అక్రమ మైనింగ్ కు డాన్ చంద్రబాబు నాయుడని ఆరోపించారు.  

వైసీపీలో కాపు కుదుపు...రంగంలోకి కాపు కోటరీ

 రాజకీయాల్లో సిగ్గులేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమేనని విమర్శించారు. చంద్రబాబుకు సిగ్గులేని వ్యక్తి అన్న బిరుదు సూటవుతుందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీఆర్ ప్రారంభింస్తే అందుకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారన్నారు. 

2014లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బాయ్ కాట్ చెయ్యాలన్నా చంద్రబాబు నాయుడు నాలుగేళ్లు తిరిగేసరికి అదే కాంగ్రెస్ తో  జతకడుతున్నారని మండిపడ్డారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరచిన వ్యక్తికి నిస్సుగ్గుగా మద్దతు పలికారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీతో రాయబారం కోసం తన కుటుంబ సభ్యులను పంపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకు ఐదు పార్టీలతో పెళ్లిళ్లు అయ్యాయని ఇప్పుడో ఆరోపెళ్లికోసం ఆరాట పడుతున్నారన్నారు.  

బీజేపీని పెళ్లి చేసుకుని వదిలేశారని అలాగే టీఆర్ఎస్ మరియు సీపీఐ, సీపీఎంలను పెళ్లి చేసుకుని వదిలేశాడని ఎద్దేవా చేశారు. అలాగే జనసేన పార్టీని కూడా పెళ్లి చేసుకుని వదిలేశాడన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు....ఇలా పార్టీలు మార్చడం చూస్తుంటే అవకాశ వాద రాజకీయాలకు పెట్టింది పేరుగా చంద్రబాబు నాయుడును చెప్పుకోవచ్చునని అభిప్రాయపడ్డారు.  

చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మెడికల్ కళాశాలలో విద్యార్థులు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారని...రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని...నిరుద్యోగుల బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో వేస్తున్న పన్నులు ముల్లుల్లా గుచ్చుకుంటున్నాయన్నారు. ఆర్టీసీ చార్జీలు, విద్యుత్ చార్జీలు, స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు బాదుడే బాదుడే అంటూ ఎద్దేవా చేశారు. 

పారిశ్రామిక సమ్మిట్ ల పేరుతో ప్రజలను నిలువునా నమ్మించి మోసం చేస్తున్నారన్నారు.  అదిగోల లక్షలకోట్ల పెట్టుబడులు వస్తున్నాయి ఇది లక్షలాది ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని అంటున్నారే తప్ప ఎక్కకడైనా కంపెనీ వచ్చిందా...కనీసం ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా అంటూ ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పట్టించుకోని చంద్రబాబు నాయుడు సిగ్గులేకుండా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు.  ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందే కాకుండా నలుగురుకు మంత్రి పదవులివ్వడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర విభజనకు ఆద్యుడు...ప్రత్యేక హోదాను అడ్డుకున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడేనని గుర్తు చేశారు.  
 
అమరావతి బాండ్ల విషయంలో 2 వేల కోట్లు వచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు అందులో కోట్లాది రూపాయలు కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు జగన్. అమరావతితోపాటు తెలంగాణ, మహారాష్ట్ర కూడా బాండ్లు పెట్టారన్నారు. అమరావతికి బాండ్ల ద్వారా 2వేల కోట్లు వస్తే బాండ్లపై వడ్డీ 10.32 శాతంకు తీసుకువచ్చారని అంటే పదేళ్లలో పదివేల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. 

జీహెచ్ఎంసీ బాండ్లు  8.9శాతం వడ్డీతో తెచ్చిందని...అలాగే మహారాష్ట్రలోని పూణే బాండ్లు 7.59 శాతం వడ్డీతో తెస్తే చంద్రబాబు నాయుడు మాత్రం అధిక వడ్డీకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెయ్యి కోట్లకు కోటి రూపాయలు కమిషన్ ఇస్తే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రెండు వేల కోట్ల బాండ్లకు కమిషన్ 17కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చిందని అంటే పదిహేను కోట్లు చంద్రబాబుకు కమిషన్న రూపంలో జేబులోకి వెళ్లాయన్నారు. 

చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో....దీక్షలతో...గెస్ట్ హౌస్ లతో కోట్లాది రూపాయలు దుబారా చేస్తున్నారని ఇప్పటి వరకు 6వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్నిచంద్రబాబు నాయుడు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఆ 6వేల కోట్లు పోలవరం ప్రాజెక్టుకు పెడితే ఈరోజు నీరు కూడా వచ్చేదన్నారు.

ఇకపోతే రాజధాని పరిసర ప్రాంతాల్లో ప్రతీది తాత్కాలికంగా నిర్మించారే తప్ప శాశ్వతంగా ఏది నిర్మించలేదని జగన్ విమర్శించారు. టెంపరరీ సెక్రటేరియట్, టెంపరరీ అసెంబ్లీ ఇలా అన్నీ తాత్కాలికంగానే నిర్మించారే తప్ప శాశ్వత ప్రాతిపదికన ఏదీ నిర్మించలేదన్నారు. టెంపరరీ సెక్రటేరియట్ కు అడుగుకు 10 వేలు ఇచ్చి నిర్మిస్తే సీలింగ్ ఊడిపోయిన పరిస్థితి అన్నారు. బయట 3 సెంటీమీటర్ల వర్షం వస్తే లోపల 6 సెంటీమీటర్ల వర్షం ఉంటుందన్నారు.....అడుగుకు 10 వేల రూపాయలు ఇస్తే సెక్రటేరియట్ లో సీలింగ్ ఊడిపోవడం ఏంటని ప్రశ్నించారు. 
 
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఎన్నికల హామీలను వైసీపీ అధినేత జగన్ లీకు చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్టణం కోటవురట్లలోని బహిరంగ సభలో పాల్గొన్న జగన్ టీడీపీపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ప్రతీ ఇంటికి కేజీ బంగారం ఇస్తానని కేజీ బంగారంతో బోనస్ గా బెంజ్ కారు కూడా ఇస్తానని హామీలిస్తారని తెలిపారు. 

అయితే ఈ హామీలన్నీ నిజమైనవి కావని ఇలాంటి అబద్దపు హామీలు కూడా ఇస్తారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చెయ్యలేదని కానీ 95శాతం అమలు చేశాం అని ఆబద్దాలు చెప్పే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈసారి బంగారం, బెంజ్ కారు అంటూ మీ చెవుల్లో ఖాళీఫ్లవర్ పెట్టేందుకు రెడీ అవుతారని విమర్శించారు.  

 
 

loader