భార్యను లేపుకెళ్లిన యువకుడి ఫోటోను ఊరంతాా ఊరేగిస్తూ వినూత్న నిరసన తెెలిపాడు ఓ బాధిత భర్త. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.
పుట్టపర్తి : కట్టుకున్న భార్య ప్రియుడితో లేచిపోతే ఆ భర్త పరువు పోయిందని బాధపడుతూ కూర్చోలేదు. భార్యను లేపుకెళ్లినవాడి పరువును బజారుకు ఈడ్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా తన భార్యను వలలో వేసుకున్న యువకుడి పోటోకు చెప్పులదండ వేసి ఊరంతా ఊరేగించాడు. తన భార్యను లేపుకెళ్లాడని ఊరంతా చాటింపు వేయించాడు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.
బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం క్యాంపురం గ్రామానకి చెందిన అంజి, నేత్రావతి భార్యాభర్తలు. హాయిగా సాగుతున్న వీరి సంసారంలో అదే గ్రామానికి చెందిన దివాకర్ అనే యువకుడు చిచ్చు పెట్టాడు. మాయమాటలతో నేత్రావతిని వలలో వేసుకున్న దివాకర్ అక్రమసంబంధం సాగించాడు. అంతటితో ఆగకుండా ఆమెను భర్తకు దూరంచేసి తనవెంట తీసుకెళ్లాడు.
భార్యను ప్రియుడు లేపుకెళ్లాడని ఇంట్లో కూర్చుని బాధపడకుండా అంజి వినూత్న నిరసన తెలిపాడు. దివాకర్ ఫోటోకు చెప్పులదండ వేసి స్వయంగా అంజియే సైకిల్ పై పెట్టుకుని ఊరంతా ఊరేగించాడు. తన భార్యకు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిన నీచుడు వీడేనంటూ గ్రామస్తులతో కూడా చెప్పలతో కొట్టించాడు. అలాగే తన భార్య ప్రియుడితో లేచిపోయిందంటూ చాటింపు కూడా వేయించాడు.
Read More క్షుద్రపూజల పేరుతో మహిళలకు వల.. వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముఠా అరెస్ట్...
ఇలా ఎవడైనా పెళ్లయిన మహిళల వెంటపడాలంటే భయపడేలా దివాకర్ పరువుతీసాడు. గ్రామస్తులు కూడా దివాకర్ ఫోటోపై ఉమ్మెస్తూ బూతులు తిట్టారు. కట్టుకున్న భర్తను కాదని ప్రియుడితో లేచిపోయిన నేత్రావతిని కూడా తిట్టుకుంటున్నారు.
