చంద్రబాబుకు 13 ప్రశ్నలు వేసిన వైసిపి నేత

YCR leaders poses 13 questions to chandrababu naidu
Highlights

  • టీడీపీ నేతలు, కార్యకర్తలు అవినీతికి పాల్పడితే చూసిచూడనట్లుండాలని చంద్రబాబు చెప్పారా? లేదా?
  • వైఫల్యాలను కలెక్టర్ల మీద నెట్టాలని చంద్రబాబు చూస్తున్నారా లేదా?
  • రెండు రోజుల కలెక్టర్ ల కాన్ఫరెన్స్ లో  బాబు  ఊకదంపుడు ఉపన్యాసాల వల్ల ప్రయోజనం ఏంటి?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రెండు రోజుల కలెక్టర్ల కాన్షరెన్స్  ఈ రోజు ముగిసింది. రెండురోజులు విరామం లేకుండా ప్రసగించారు. హితోపదేశం చేశారు. ఇంత సుదీర్ఘోపన్యాసాలు చేసే ముఖ్యమంత్రులు అరుదు. అయితే, ఇదంతా ఉకదంపుడు ప్రసంగమని వైసిపి నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నాలుగేళ్ల పాలన తన  వైఫల్యాల్ని అధికారులపై నెట్టేయాలని, కప్పిపుచ్చాలని, ఇలాంటి ఉపన్యాసాలతో చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలకు అధికారులకు సంబంధం లేదని చెబుతూ పాలకులడిదే బాధ్యత అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి 13 ప్రశ్నలు సంధించారు. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.నాలుగేళ్ల లో  ఏం సాధించలేదని కలెక్టర్ల కాన్ఫనెన్స్ లో చంద్రబాబు అంగీకరించారని అన్నారు.

 

ధర్మాన వేసిన ప్రశ్నలు

 

1. మీ ఏలుబడి లో  ఏ కలెక్టర్ కయినా ఒక నిర్ణయం తీసుకొని అమలు చేసే శక్తి ఉందా?

2.కనీసం రేషన్ కార్డు ఇచ్చే స్వతంత్ర  అధికారం  కలెక్టర్ కు ఉందా?

 3.ఎ కలెక్టరయినా ఫించను మంజూరు చేసే స్థితిలో ఉన్నారా?

4.కలెక్టర్లకు మించిన అధికారం రాజ్యాంగేతర జన్మభూమి కమిటీల చేతుల్లోకి వెళ్లిపోయిందా లేదా?

5.జన్మభూమి కమిటీలు చెప్పినట్లే కలెక్టర్లు  వ్యవహరించాలని చంద్రబాబు చెప్పలేదా?

6.అధికారుల అధికారాలకు చంద్రబాబు అడ్డుకట్ట వేసి, టిడిపి నేతలు పెత్తనం ఛలాయించడం మీకు లేదా?

7.టీడీపీ నేతలు, కార్యకర్తలు అవినీతికి పాల్పడితే చూసిచూడనట్లుండాలని చంద్రబాబు చెప్పారా? లేదా?

8.వైఫల్యాలను కలెక్టర్ల మీద నెట్టాలని చంద్రబాబు చూస్తున్నారా లేదా?

9.రెండు రోజుల కలెక్టర్ ల కాన్ఫరెన్స్ లో  బాబు  ఊకదంపుడు ఉపన్యాసాల వల్ల ప్రయోజనం ఏంటి?

10.బాబూ మీ వైఫల్యాలను కలెక్టర్ల మీదకు ఎందుకు నెడుతున్నారు?

11.నాలుగేళ్లలో ఎన్ని ఇళ్లు కట్టారో చంద్రబాబు చెప్పాలి?

12.చంద్రబాబు ఎక్కడైనా పేదవాళ్ల కోసం ఒక్క ఇల్లు కట్టారా?

13.గృహ‌నిర్మాణం కోసం ఎక్కడైనా ఎకరం భూములు కొన్నారా?

 

 

 

 

 

loader